నితిన్ నటించిన తాజా చిత్రం 'ఛల్ మోహన్ రంగ' ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కాగా నితిన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం శ్రీవనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలో మంచి విజయం సొంతం చేసుకున్న వెంకీ కుడుములతో నితిన్ ఓ చిత్రం చేయబోతున్నాడు.
వెంకీ కుడుములు చెప్పిన స్టోరీ లైన్ కు నితిన్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా కథకు అవసరమైన మార్పులని నితిన్ దర్శకుడికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నితిన్ లై వంటి థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం నిరాశ పరచడంతో నితిన్ ప్రస్తుతం ప్రేమ కథలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఛలో చిత్రం ముందు వరకు నాగ శౌర్య కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. నాగశౌర్యకు ఎట్టకేలకు ఓ హిట్ అందించడంతో వెంకీపై నితిన్ నమ్మకం పెట్టాడని అంటున్నారు.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ.. ఆ చిత్రం తరువాత నితిన్ ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.