దెబ్బకు కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయ్.. కీర్తి సురేష్ ముక్కు మీద గుద్దేసిన నితిన్

నితిన్ కీర్తి సురేష్‌లు జంటగా వస్తోన్న చిత్రం రంగ్ దే. ఈ మధ్యే వదిలిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అను అర్జున్ పాత్రల్లో కీర్తి సురేష్, నితిన్ బాగా ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. కారాలు మిరియాలు నూరే క్యారెక్టర్‌లో కీర్తి సురేష్ కనిపించబోతోంది. టాం అండ్ జెర్రీ వార్‌లా కీర్తి సురేష్, నితిన్ జంట ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి వీరు ఆన్ స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రచ్చ చేస్తున్నారు.

 సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

నితిన్ కీర్తి సురేష్‌లిద్దరూ కూడా పగ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య షూటింగ్‌లో కునుకు తీస్తోన్న కీర్తి సురేష్ ఫోటోను నితిన్ షేర్ చేయడం కథ మొదలైంది. అలా తనను నిద్రపోతోండగా ఫోటో తీయడం, షూటింగ్ గ్యాప్‌లో ఇలా చేస్తోందని చెప్పడంతో కీర్తి సురేష్ హర్ట్ అయి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

 అలా రివేంజ్..

అలా రివేంజ్..

అలా తనను ఇరికించడంపై కీర్తి సురేష్ ఎట్టకేలకు పగతీర్చుకుంది. దర్శకుడిని పరిగెత్తించి మరీ కొట్టింది. ఇక మొన్నటికి మొన్న నితిన్ ఫోటోను ఎడిట్ చేసి ఆడుకుంది. మొత్తానికి ఇలా రంగ్ దే టీం ఏదో ఒకటి చేసి సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు.

మిస్సింగ్ అంటూ..

మిస్సింగ్ అంటూ..

రీసెంట్‌గా నితిన్ మరో సెటైరికల్ పోస్ట్ వేశాడు. కీర్తి సురేష్ చిన్న నాటి ఫోటోను షేర్ చేస్తూ.. కనబడుట లేదు.. మిస్సింగ్ అంటూ పోస్ట్ చేశాడు. నితిన్ పోస్ట్‌పై హైద్రాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. మీరేం కంగారు పడకండి మేం తీసుకొస్తామని వారు ట్వీట్ వేశారు.

Recommended Video

Preethi Asrani The Next Big Thing In Tollywood | A Movie
తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

తాజాగా కీర్తి సురేష్ ఓ ట్వీట్ వేసింది. ఇందులో నితిన్ షాట్‌లో భాగంగా కీర్తి సురేష్‌ను కొట్టాలి. ఓవర్ లాప్ చేస్తూ పంచ్ ఇచ్చాడు నితిన్. కానీ ఆ తరువాత రిమోట్ తీసుకుంటూ ఉండగా.. చేతికి ఉన్న గ్లౌవ్స్ కీర్తీ సురేష్ ముక్కుకు తగిలింది. దీంతో కీర్తి సురేష్‌కు కళ్ల బైర్లు కమ్మినట్టున్నాయ్. యాక్ట్ చేయమంటే నిజంగా కొట్టేశాడని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. కావాలని కొట్టలేదు అను అంటూ నితిన్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X