29 నుంచి స్పెయిన్ లో నితిన్ ...
ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని , రెండవ షెడ్యూల్ స్పెయిన్ లో ఈ నెల 16 నుంచి ప్లాన్ చేసారు. అయితే ఇండియన్ సినిమా వంద రోజుల పండుగ సందర్భంగా ఈ నెల 29 కి వాయిదా పడింది. 'హార్ట్ ఎటాక్' చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ టైటిల్ గురించే చర్చ. టైటిల్ యాంటీగా ఉన్నా... ఫలితం మాత్రం కచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది ఈ చిత్రం యూనిట్. 'హార్ట్ ఎటాక్' చిత్రానికి నిర్మాత కూడా పూరీనే.
ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ -''పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనేది నా చిరకాల వాంఛ. ఇంతకాలానికి అది నెరవేరబోతోంది. పూరీగారు ఈ కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అనే ఉద్వేగం నా మనసులో మొదలైంది. వాణిజ్య అంశాలు కలిగిన భిన్నమైన ప్రేమకథ ఇది'' అని చెప్పారు.
ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వెలుగు చూశాయి. చివరకు బాలీవుడ్ భామ అధాశర్మని హీరోయిన్ గా తీసుకున్నారు పూరీ. ఇటీవల హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో రాత్రివేళల్లో షూటింగ్ జరుపుకుందీ సినిమా. వరుసగా రెండు విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్‌కి ఇది కచ్చితంగా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. నవ్యమైన కథ, కథనాలతో పూరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందని తెలుస్తోంది. పూరి చిత్రానికి తొలిసారిగా అనూప్ రూబెన్స్ స్వరాలందించారు.


Click it and Unblock the Notifications












