»   »  హీరో నితిన్ 'హీరో' గా.....

హీరో నితిన్ 'హీరో' గా.....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nithin
అదేంటి నితిన్ హీరోనే కదా...మళ్ళీ హీరోగా నటించటం యేంటి అనుకుంటున్నారా. తాజాగా నితిన్ నటించబోతున్న కొత్త చిత్రానికి 'హీరో' అని పేరు పెట్టబోతున్నారు. ఆ చిత్రంలో అతని సరసన భావన నటిస్తోంది. ఈ చిత్రంతో విలన్ పాత్రలు చేసి పాపులర్ అయిన జీ.వి.దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి పూజా కార్యక్రమాలు జరిగాయి.మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం నితిన్ కి మంచి బ్రేక్ ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. హీరో టైటిల్ హీందీలోనూ, తెలుగులోనూ ఆల్రెడీ వచ్చిందే. పాపులర్ అయిన పాత టైటిల్స్ పెట్టడం ద్వారా ప్రేక్షకులలోకి త్వరగా దూసుకుపోవచ్చని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఇక నితిన్ నటించిన 'విక్టరీ' చిత్రం ఈ వారంలోనే విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X