»   » అదరకొడ్తున్న నితిన్ ‘హార్ట్ ఎటాక్’ ( కొత్త ఫోటోలు )

అదరకొడ్తున్న నితిన్ ‘హార్ట్ ఎటాక్’ ( కొత్త ఫోటోలు )

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : నితిన్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'హార్ట్ ఎటాక్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంటు లుక్ తో కనిపించబోతున్నాడు. నితిన్ లుక్‌కు సంబంధించిన ఫోటోలను ఇప్పటికే ఆన్ లైన్లో లీక్ చేసారు. ఇక తాజాగా ఈ చిత్రంలో ఆన్ లొకేషన్ ఫోటోను నితిన్ స్వయంగా ట్వీట్ చేసారు. అందులో హార్ట్ ఎటాక్ లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేగాక ఈ చిత్రం ఆన్ లొకేషన్ స్టిల్స్ సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుతున్నారు. నితిన్ చిత్రం విడుదల పై ట్వీట్ చేస్తూ...నా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం పూర్తి ప్రేమ కధా చిత్రం. సంక్రాంతికి విడుదల అవుతుంది.

  ఈ చిత్రంలో నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ యూరప్ లో జరుగుతోంది.

  ఫొటోలతో కూడిన విశేషాలు స్లైడ్ షోలో...

  మరో ఇడియట్..

  మరో ఇడియట్..


  సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది.

  క్లైమాక్స్ పైట్ కేక..

  క్లైమాక్స్ పైట్ కేక..

  ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగి తొలి షెడ్యూల్ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్‌ చిత్రీకరించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు.

  షూటింగ్ జరిగే ప్రాంతంలో...

  షూటింగ్ జరిగే ప్రాంతంలో...

  పూరి జగన్నాధ్ కి డెస్పరాడో చిత్రం చాలా ఇష్టం. దాంతో ఆ చిత్రంలో హీరో గా చేసిన Antonio Banderas ఇంటికి వెళ్లి...ఆయన తల్లితో ఇలా ఫోటో దిగారు. ఇక పూరి ఇటీవలి కాలంలో వరుసగా పరాజయాల బాటలో ఉన్న సంగతి తెలిసిందే. దేవుడు చేసిన మనుషూలు, గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో ఇలా అన్నీ ప్లాపులే. అయితే ఈ ప్లాపుల బాట నుంచి బైటపడడానికి వరుస విజయాల మీద ఉన్న నితిన్‌ని ఆశ్రయించాడు జగన్‌.

  ఎగ్జయిట్ అవుతూ..

  ఎగ్జయిట్ అవుతూ..


  ‘హార్ట్‌ ఎటాక్‌' శరవేగంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. అయితే పూరి వర్కింగ్‌ స్టయిల్‌పై నితిన్‌ చాలా ఎగ్జయిట్‌ అవుతున్నాడు. పూరి సూపర్భ్‌. స్పీడ్‌గా సినిమాని పూర్తి చేయడంలో అతడిని మించిన వాడే లేడు. కచ్ఛితంగా ఈ సినిమాతో పూరి మళ్లీ హిట్‌లతో దూసుకెళతాడు.

  పొగడ్తలు వర్షం..

  పొగడ్తలు వర్షం..

  టాలీవుడ్‌లోనే ఇలాంటి గొప్ప దర్శకుడు వేరే లేరు. పూరి దర్శకత్వంలో నటించాలన్నది నా కల. అది ఇప్పటికి నెరవేరింది ... అంటూ పూరిని నితిన్‌ పదే పదే తెగ పొగిడేస్తున్నాడు. అంతేకాదు హార్ట్‌ ఎటాక్‌ రవితేజ ‘ఇడియట్‌' కంటే పెద్ద హిట్టవుతుందంటూ తెగ సంబరపడిపోతున్నాడు. నితిన్‌ చెప్పేది నిజమే అయితే మంచిదే. పూరీకి గత వైభవం మళ్లీ రావాలని ఆశిద్దాం.

  స్పానిష్ పేపర్లో ...

  స్పానిష్ పేపర్లో ...

  ఈ చిత్రం షూటింగ్ స్పానిష్ లో జరగటంతో అక్కడ డైలీ వాళ్లు ఈ చిత్రం న్యూస్ ని కవర్ చేసారు. అక్కడ షూటింగ్ జరుపుకోవటంతో దర్శకుడు పూరిని ఇంటర్వూ చేసారు. దాన్ని ట్వీట్స్ ద్వారా అందరికీ తెలియచేసారు.

  ఇంటర్వూ చేస్తూ...

  ఇంటర్వూ చేస్తూ...

  స్పానిష్ మీడియా వారు పూరి జగన్ ని ఇంటర్వూ చేస్తూ ఇలా కనిపించారు. ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది.

  పిలకతో...

  పిలకతో...


  అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈచిత్రంలో నితిన్‌కు లుక్ తాజాగా బయటకు వచ్చింది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది.

  మరో మెట్టు పైకి..

  మరో మెట్టు పైకి..

  పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది.

  ఆసక్తితోనే..

  ఆసక్తితోనే..


  పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  హీరోయిన్...

  హీరోయిన్...


  విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా ‘1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

  నిర్మాత మాట్లాడుతూ..

  నిర్మాత మాట్లాడుతూ..


  ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

  English summary
  Nithin who is currently shooting for director Puri Jagannadh's film titled Heart Attack is sharing the working stills through social media. He has been posting pics from sets. This is the new photo which is very blurred that he has posted today (Oct 29). What is interesting about this pic is that it has the logo of the movie's title.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more