»   » లిరికల్ సాంగ్ : ఫస్ట్ లుక్ సోమవారం.. గురువారం గొడవ, నితిన్ లవ్ స్టోరీ గమ్మత్తుగా ఉందే!

లిరికల్ సాంగ్ : ఫస్ట్ లుక్ సోమవారం.. గురువారం గొడవ, నితిన్ లవ్ స్టోరీ గమ్మత్తుగా ఉందే!

Subscribe to Filmibeat Telugu
లిరికల్ సాంగ్ : ఫస్ట్ లుక్ సోమవారం.. గురువారం గొడవ, నితిన్ లవ్ స్టోరీ గమ్మత్తుగా ఉందే!

నితిన్ నటించిన తాజ చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నితిన్ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు. ఏప్రిల్ 5 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, గ ఘ మేఘ అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో సాంగ్ ని విడుదల చేశారు.

గమ్మత్తైన లిరిక్స్

ఫస్ట్ లుక్ సోమవారం.. మాట కలిపే మంగళ వారం.. బుజ్జిగుంది బుధవారం.. గొడవైంది గురువారం అంటూ సాగే ఈ పాటలోని లిరిక్స్ గమ్మత్తుగా ఉన్నాయి. నితిన్ నుంచి రాబోతున్న మరో ప్రేమ కథ ఛల్ మోహన్ రంగ.

 వినసొంపైన ట్యూన్

వినసొంపైన ట్యూన్

సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం మంచిజోరుమీద ఉన్నాడు.తొలిప్రేమ చిత్రంతో అదిరిపోయే ఆల్బమ్ అందించిన తమన్ ఛల్ మోహన్ రంగ చిత్రానికి కూడా అదేస్థాయిలో సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది. తాజగా విడుదలైన సాంగ్ లో తమన్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉంది.

 పవన్, త్రివిక్రమ్ కలసి నితిన్ కోసం

పవన్, త్రివిక్రమ్ కలసి నితిన్ కోసం

ఛల్ మోహన్ రంగ చిత్రానికి నితిన్ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు.

 మేఘ ఆకాష్ తో రొమాన్స్

మేఘ ఆకాష్ తో రొమాన్స్

లై చిత్రంలో మెరిసిన మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్, మేఘ జంటకు లై చిత్రంలో మంచి మార్కులు పడ్డాయి.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్ 5 న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Nithin's Chal Mohan Ranga second song released. Krishna Chaitanya directing this movie and Pawan Kalyan, Trivikram producing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu