For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేపేసారు : నితిన్ గే రొమాన్స్,అడల్ట్ కామెడీ

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా గే కామెడీ ఓ పెద్ద ట్రెండ్ అయ్యి కూర్చుంది. రవిబాబు తన చిత్రాల్లో మొదలెట్టిన ఈ కామెడీని నితిన్ తన గుండె జారి గల్లంతైందితో నెక్స్ట్ లెవిల్ కి తీసుకు వెళ్లారు. ఒక లైలా కోసం చిత్రంలో కొనసాగించారు. ఈ నేపధ్యంలో అదే సక్సెస్ సూత్రమని నమ్మిన నితిన్ ఈరోజు నితిన్ చిత్రం ‘చిన్నదాన నీకోసం' లోనూ ఆ తరహా సన్నివేశాలు పెట్టారని తెలుస్తోంది. అయితే సెన్సార్ కత్తిరెకు అవి బలైపోయాయి.. ఈ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో తొలిగించబడ్డ కొన్ని డైలాగులు చూద్దాం..

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఓ గే వచ్చి నితిన్ మీద చెయ్యి వేస్తే..దానికి నితిన్...'తొందరెందుకు నేను చెయ్యి వెయ్యమన్నది కారు మీద' అనే డైలాగు పెట్టారు. దానికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. అలాగే ఇంకా అడల్ట్,డబుల్ మీనింగ్ డైలాగులు సెన్సార్ కత్తిర ద్వారా తొలిగించబడ్డాయి. వాటిల్లో... 'మీరు ఆడించుకోండి మోటర్', 'ఇక్కడ ఇది పోయింది, లోపలింకో పోద్దో', 'పెట్టుకుంటే నాకు కారిపోయేలా ఉంది ', 'నేను బ్యాక్ సీట్ ఎక్కేస్తా ' ,'కొసేస్తా...ఏంటది' వంటివి చాలా తొలిగించారు. అయితే 'U/A' సర్టిఫికేట్ కోసం వాటినన్నటినీ నిర్మాతలు వదులుకోవాల్సి వచ్చింది.

  Nithin's Gay Romance & Adult Comedy scissored

  పన్నెండు వరస ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ తన వయస్సుకు తగ్గ లవ్ స్టోరీలు ఎంచుకుంటూ యాక్షన్ జోలికి వెళ్లకుండా సేఫ్ జోన్ లో కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఆయన ఇంతకు మునుపు చేసిన ‘ఇష్క్‌', ‘గుండెజారి గల్లంతయ్యిందే', ‘హార్ట్‌ ఎటాక్‌' మూడూ లవ్‌ స్టోరీలే. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ కొత్త చిత్రం కూడా మరో లవ్ స్టోరీ. అయితే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కు అథిక ప్రాధాన్యత ఇచ్చానంటున్నారు.

  ఈ చిత్రంలో నితిన్ తన సొంత పేరుతో కనిపిస్తారు. అతను పవన్‌కల్యాణ్‌ అభిమానిని. ఒక రోమియో టైప్‌ కేరక్టరు. నితిన్ కుటుంబ సభ్యులు అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పమంటే... అతనికు ఇప్పటివరకూ తనకు తగ్గ,సరైన గర్ల్ ప్రెండ్ దొరకలేదంటాడు. అయితే ఓ రోజు అతను నందిని(మిస్తి చక్రవర్తి)ని మొదటి సారి కలవగానే అతని జీవితం మారిపోతుంది. ఆ అమ్మాయి నచ్చగానే, ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి అతను పడే పాట్లు, చివరకు ఆమెను ఎలా దక్కించుకున్నాడనేది చాలా ఇంటరెస్టింగ్‌గా, కొత్తగా ఉంటుంది.

  నితిన్ మాట్లాడుతూ...‘ఇష్క్‌' ట్రావెల్‌ లవ్‌స్టోరీ, ‘గుండెజారి గల్లంతయ్యిందే' ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, ‘హార్ట్‌ ఎటాక్‌' ఎమోషనల్‌ లవ్‌స్టోరీ అయితే ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‌ మేళవించిన లవ్‌స్టోరీ. ఇందులో కుటుంబ అనుబంధాలు చాలా బాగుంటాయి. వాటికంటే కూడా ఈ సినిమాలో హీరోయిన్‌ను మరింత ఎక్కువగా ప్రేమించే పాత్ర నాది. ఆ మూడు సినిమాల్లో కంటే ఇందులో క్లైమాక్స్‌ చాలా సా్ట్రంగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది అన్నారు.

  బ్యానర్: శ్రేష్ట్ మూవీస్

  నటీనటులు: నితిన్, మిస్తి,నాజర్, అలీ, నరేష్, సితార, మధునందన్ తదితరులు

  కెమెరా: ఆండ్రూ,

  మాటలు: హర్షవర్ధన్,

  సంగీతం: అనూప్‌రూబెన్స్,

  పాటలు: కృష్ణచైతన్య,

  ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి,

  ఆర్ట్: రాజీవ్ నాయర్,

  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.

  నిర్మాతలు: ఎన్.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి

  సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

  విడుదల తేదీ: 25 డిసెంబర్,2014

  English summary
  'Chinnadana Nee Kosam' have several adult/double meaning dialogues including 'Meeru Aadinchukondi Motor', 'Ikkadidi Poyindi, Lopalinkem Poddo', 'Pettukunte Naaku Kaaripoyela Vundi', 'Nenu Back Seat Ekkestha' and 'Kosestha...Yentadhi'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X