»   » ఖతర్నాక్.... నితిన్ కొత్తలుక్ సూపర్ గా ఉంది

ఖతర్నాక్.... నితిన్ కొత్తలుక్ సూపర్ గా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్ తన తాజా చిత్రంలో న్యూ లుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'అ ఆ' అందించిన భారీ విజయంతో .. ఆ స్థాయికి తగిన కథ కోసం నితిన్ వెయిట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు హను రాఘవపూడితో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో నితిన్ పాత బస్తీ కుర్రాడిగా కనిపించనున్నాడు. హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. స్టైలీష్ విలన్ గా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రం కోసం నితిన్ గడ్డం ని భారీగా పెంచాడు . గడ్డం తో కనిపిస్తున్న నితిన్ చాలా బాగుండటం తో ఈ లుక్ కొత్తగా ఉందని పైగా చాలా బాగుందని కితాబు నిస్తున్నారట సన్నిహితులు దాంతో అదే గెటప్ ని కొనసాగిస్తున్నాడు నితిన్ .14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రారంభమైన షూటింగ్ స్పాట్ లో నితిన్ లుక్ కి సంబంధించిన ఓ స్టిల్ బయటకొచ్చింది. ఇందులో నితిన్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.

Nithin's new look with beard for Hanu Raghavapudi film Impresses all

న్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్ 'ధృవ' వరకు యంగ్ హీరోలు అంతా డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన నేపధ్యంలో ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని నితిన్ కొనసాగిస్తున్నాడు. హను రాఘవపూడి డైరక్షన్లో నటిస్తున్న నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.

ఆ మాటలకు బలం చేకూరుస్తు ఈసినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ కు సంబంధించిన నితిన్ లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.ఇప్పటి ట్రెండ్ ప్రకారం అందరూ పెంచుతున్న పొడుగు గడ్డం తోనే నితిన్ కనిపించనున్నాడు. ఆమధ్య యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం లో కొద్ది పాటి గడ్దం తో కనిపించిన నితిన్ ఇప్పుడు మరింత పెరిగిన గ్డ్డం తో కనిపిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలొ కనిపిస్తోంది.

English summary
Don’t be surprised if you suddenly find this bearded man around you. He is none other than actor Nithin. After the super success of ‘A.Aa’, young hero Nithin took a gap of 6 to 7 months time for his next.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu