'విక్టిరి' కోసం నితిన్ ప్రత్యేక పూజలు...

ఈ సినిమాలో నితిన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. దీని కోసం అతను మూడు నెలలు పైగా శ్రమించాడు. ట్రైనర్ సంపత్ ఆధ్వర్యంలో కండరాల్ని పెంపొందించుకొని, ఖచ్చితమైన డైట్ పాటించాడు. సినిమాలో ఒకసారికి మించి అతను చొక్కావిప్పి తన కండల్ని ప్రదర్శించాడు. ఆరంభ సన్నివేశంలో, ఒక పాటలో, ఒక ఫైటులో అతను చొక్కా లేకుండా కనిపిస్తాడు. 'విక్టరి' సినిమా ల్యాండ్ మాఫియా మీద తిరుగుబాటు చేసిన కుర్రాళ్ల కథ. సిటీలో భూమి ధరలు విపరీతంగా పెరగకుండా పరిష్కారాన్ని కూడా కనుగొనే ఉడుకు రక్తం వున్న యువకుల కథ. "ఇవాళ సొంత భూమి అనేది తీవ్రమైన సమస్య. ఈ కథకి ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు" అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
కాగా దర్శకుడు రవి సి కుమార్‌కు ఈ బానర్‌లో ఇది వరుసగా మూడవ సినిమా కావడం గమనార్హం. మొదట ఆయన 'ద ఎండ్' అనే సామాజిక ప్రయోజనాత్మక చిత్రం తీశారు. దానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన జగపతి హీరోగా రూపొందించిన 'సామాన్యుడు' బాగా ఆడింది. ఇప్పుడు 'విక్టరి' రూపొందించారు.


Click it and Unblock the Notifications











