»   » ఆ రీమేక్ కి నిత్యామీనన్ ని తీసుకున్నారు

ఆ రీమేక్ కి నిత్యామీనన్ ని తీసుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నిత్యామీనన్ ఉంటే గ్యారెంటీ హిట్ అనే నమ్మకానికి వచ్చేసారు దర్శక,నిర్మాతలు. తాజాగా ఆమెతో ఓ మళయాళ రీమేక్ ని రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 22 Female Kottayam అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తమిల,తెలుగు భాషల్లో రీమేక్ అవుతోంది.

ఇక ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా నడుస్తుంది. తనను మోసం చేసిన వారిపై హీరోయిన్ తీర్చుకునే పగ,ప్రతీకారం ప్రధానాంసంగా ఉంటుంది. మళయాళంలో ఈ చిత్రం బాగా ఆడింది. గత కాలం హీరోయిన్ శ్రీప్రియ ఈ చిత్రం రీమేక్ వెర్షన్ డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

నిత్యామీనన్ కి తెలుగులోనూ మార్కెట్ ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది.

నిత్యామీనన్ తెలుగులో నటించిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఇష్క్, గుండె జారి గల్లంతైంది చిత్రాలు విజయం సాధించటంతో ఈ జంటకు మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆ క్రేజ్ ని మరోసారి క్యాష్ చేసుకోవాలని నితిన్ నెక్ట్స్ చిత్రం నిర్మాతలు ఫిక్స్ అయ్యారని సమాచారం.

నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రంలో ఈ మార్పు జరగనుంది. మొదట ఈ చిత్రంలో గౌరవం చిత్రం హీరోయిన్ యామీ గౌతమి అనుకున్నారు. కానీ గౌరవం ప్లాప్ కావటంతో ఈ సినిమాలోంచి ఆమెను తొలిగించినట్లు తెలుస్తోంది.

English summary
Buzz is that Nithya Menen is doing the remake of Malayalam film, 22 Female Kottayam, which is loosely based on Ram Gopal Varma produced Urmila starrer Ek Haseena Thi. Grapevine has it that yesteryear actress Sripriya is directing this film in Tamil with Nithya Menen as heroine.
Please Wait while comments are loading...