twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యామీనన్ ...అత్యాచార భాధితురాలుగా ( ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మళయాళ చిత్రం 22 Female Kottayam రీమేక్ గా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి మాలిని 22 అనే టైటిల్ పెట్టారు. మొదట మళయాళంలో రూపొందిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ అత్యాచార భాధితురాలిగా కనిపిస్తుంది.

    ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా నడుస్తుంది. తనను మోసం చేసిన వారిపై హీరోయిన్ తీర్చుకునే పగ,ప్రతీకారం ప్రధానాంసంగా ఉంటుంది. మళయాళంలో ఈ చిత్రం బాగా ఆడింది. గత కాలం హీరోయిన్ శ్రీప్రియ ఈ చిత్రం రీమేక్ వెర్షన్ డైరక్ట్ చేస్తోంది.ఈ చిత్రం కోసం బలాత్కార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ముంబయిలో మహిళ ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడం దిగ్భ్రాంతిని కలిగించిందని నిత్యామీనన్ పేర్కొంది.

    ఇక ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా నడుస్తుంది. తనను మోసం చేసిన వారిపై హీరోయిన్ తీర్చుకునే పగ,ప్రతీకారం ప్రధానాంసంగా ఉంటుంది. మళయాళంలో ఈ చిత్రం బాగా ఆడింది. గత కాలం హీరోయిన్ శ్రీప్రియ ఈ చిత్రం రీమేక్ వెర్షన్ డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

    మార్కెట్ ఎక్కువని..

    మార్కెట్ ఎక్కువని..

    నిత్యామీనన్ కి తెలుగులోనూ మార్కెట్ ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది.

    నిత్యామీనన్ మాట్లాడుతూ...

    నిత్యామీనన్ మాట్లాడుతూ...

    ఈ చిత్రంలో నటించమని శ్రీప్రియ అడిగినప్పుడు ఆలోచించానంది. అయితే మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటించడం వలన తన సంకోచం పోయిందని చెప్పింది. మహిళలపై బలాత్కారానికి పాల్పడేవారు ఈ చిత్రం చూస్తే అలాంటి చర్యలకు పాల్పడరని అంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మానవ మృగాల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

    దర్శకురాలు...

    దర్శకురాలు...

    సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘22 మాలిని పాళయం కోట్టై' పేరుతో రూపొందుతోంది. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తోంది. నిత్యామీనన్ కి తెలుగులోనూ మార్కెట్ ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ప్రేరణ అదే...

    ప్రేరణ అదే...

    ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది. ఊర్మిళ ప్రధాన పాత్రలో చేసిన ఏక్ హసీనా థీ చిత్రం అప్పట్లో బాగానే ఆడింది. అలాగే ఈ చిత్రం చివర్లో దర్సకుడు తను ఈ చిత్రం నుంచి ప్రేరణ పొందానని చెప్పారు.

    తమిళ వెర్షన్...

    తమిళ వెర్షన్...


    ‘మాలిని 22 పాలయంకొట్టై' అని తమిళ వెర్షన్ టైటిల్. అక్కడా నిత్యాకి మంచి మార్కెట్ ఉండటంతో బాగానే బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు. నిత్య పేరు మీదే సినిమా ఓపినింగ్స్ ఆధారపడి ఉన్నాయి.

    మళయాళంలో ఎవరంటే..

    మళయాళంలో ఎవరంటే..


    ఈ చిత్రం మలయాళంలో రీమా కల్లింగల్, ఫహాద్ నటించిన '22 ఫిమేల్ కొట్టాయం' సినిమాకు రీమేక్. ప్రస్తుతం ఈ తమిళ రీమేక్ లో రీమా పాత్రను నిత్య, ఫహాద్ పాత్రను నిత్య, ఫహాద్ పాత్రను తమిళ నటుడు క్రిష్ పోషిస్తున్నారు.

    మొదటి హిందీ సినిమా...

    మొదటి హిందీ సినిమా...

    ప్రధాన తారాగణాన్ని ఈమధ్యే చెన్నైలో ప్రకటించిన శ్రీ ప్రియ తాను ఈ సినిమాను హిందీలో కూడా చేసే ఆలోచన వున్నట్లు తెలిపింది. ఇదే కనుక జరిగితే నిత్యామీనన్ కు ఈ చిత్రం బాలీవుడ్ లో మొదటి సినిమా అవుతుంది. అత్యాచారానికి గురైన పాత్ర చుట్టూ ఈ చిత్ర కధ తిరుగుతుంది.

    దర్శకురాలు మాట్లాడుతూ..

    దర్శకురాలు మాట్లాడుతూ..

    19 ఏళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్‌ కుర్చీలో కూర్చున్నా. నా భర్త రాజ్‌కుమార్‌ సినిమాను నిర్మిస్తున్నారు. నిత్యమీనన్‌ కథానాయిక. నటి జయభారతి కుమారుడు క్రిష్‌ కథానాయకుడు. కోటా శ్రీనివాసరావు, నరేష్‌, కోవై సరళ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. అరవింద్‌-శంకర్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

    నిత్యమీనన్‌ మాట్లాడుతూ..

    నిత్యమీనన్‌ మాట్లాడుతూ..

    ప్రారంభంలో కథ చెప్పినప్పుడు నటించేందుకు భయపడ్డా. ఆ పాత్ర చాలా కఠినమైనది. పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనేమోనన్న భయం కలిగింది. శ్రీప్రియ ధైర్యం చెప్పారు. ఆ తర్వాతే ఒప్పుకున్నానని తెలిపింది.

    నరేష్ మాట్లాడుతూ...

    నరేష్ మాట్లాడుతూ...

    తన కెరీర్‌లో ఇదివరకు చేయని పాత్రలో నటిస్తున్నానని నరేష్‌ చెప్పారు. ఆయన ఈ చిత్రంలో పాత్ర చాలా బాగా నచ్చిందని, తప్పకుండా చిత్రం విజయవంతం అవుతుందని అభిలషించారు.

    English summary
    
 Nithya Menen is slowly becoming the most sought after heroine in Tollywood. Now she is doing a heroine oriented film. The film has been titled as Malini 22, which happens to be a remake of 22 Female Kottayam. This film was a superhit in Malayalam. Malini 22 is getting ready in both Tamil and Telugu. Presently the Telugu version is being shot in Hyderabad. Yesteryear actress Sri Priya is directing the film. The popular actress of the 70's is wearing the director's cap with this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X