For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా లవ్ బ్రేకప్ కారణం ఇదే: తెరవెనుక విషయాలనూ పంచుకున్న నిత్యా మీనన్

  |

  నటి నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించిందంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లే ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ కేరళ కుట్టికి పొగరుబోతు అనే పేరు కూడా ఉంది ఆమె కూడా ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా మాట్లాడతారు. కాస్త హైట్ తక్కువైనా వెయిట్ అయిన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తనకు పాత్ర నచ్చితే దాని పరిధి గురించి అసలు ఆలోచించదు.

  అయితే ఈ మధ్య సందీప్ కిషన్ తో చేసిన "ఒక అమ్మాయి తప్ప" మాత్రం నిత్య సెలక్షన్ మీదే అనుమానం వచ్చేలా చేసింది. బక్సాఫీస్ దగ్గర కుదేలయ్యిందీ సినిమా. "దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే ఉందని, హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటూ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్. ఈసారి మరికొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.

  "నాకు పాఠశాలలో చదువుకునే సమయంలోనే పాటలపై ఆసక్తి. స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదానిని. అవే నాకు సినిమా అవకాశాలు కల్పించాయి. తొలి సారిగా నటి టబుకు చెల్లెలిగా నటించాను.అందుకు 50 వేలు పారితోషికం ఇచ్చారు".అంటూ కెరీర్ గురించి చెప్పిన ఈ నూడుల్స్... తన ప్రేమ విశయాన్నీ అది బ్రేకప్ ఎలా అయిందన్న సంగతినీ చెప్పింది.

  Nithya Menen's breakup story

  "నాకు ఎలా చెప్పాల్లో అర్థం కావట్లేదు. నేను పద్ధెనిమిదేళ్ల్ల వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాను. అందుకేనేమో ప్రేమ కథాచిత్రాల్లో ఇంతలా ఒదిగిపోగలుగుతున్నాను. ఆ ప్రేమ గురించి ఎక్కువ వివరాలు మాత్రం అడగొద్దు. ఎందుకో అతనితో కలిసి జీవించలేనని పించింది. అందుకే ఆ ప్రేమక్థ అలా ముగిసిపోయింది. నేను కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన విషయం అది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నా.

  ఏయే సందర్భాల్లో ఎలా ఉండాలో నా జీవితమే నాకు నేర్పింది. జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేరణగా తీసుకుని నటిస్తాను. నాన్న నాస్తికుడు. అందుకని అమ్మ ఇంట్లో పూజలు చేయడం మానేశారు. నాకు దైవభక్తి మెండు. నాన్న నన్ను గుడికి తీసుకెళ్లేవారు. అయితే నేను దైవ దర్శనం చేసుకుని వచ్చే వరకూ నాన్న గుడి బయట వేచి ఉండేవారు.

  నాది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్థత్వం. నాకు మనసులో అనిపించింది బయటకు చెప్పేస్తాను. బహుశా అదికూడా నా ప్రేమ వైఫల్యానికి కారణమేమో. మామూలుగా ఎక్కువగా మనుషులతో కలిసి పోయే మనస్తత్వం కాదటq తనది. అందుకే సెట్స్ మీదకూడా ఎక్కువగా తన సహనటుల యాక్టింగ్ ని గమనిస్తూనో లేదంటే ధ్యానం చేసుకుంటూనో గడిపేస్తుందట నిత్య....

  English summary
  Nithya Menon revealed in her personal interview..." during my teenage. At 18, I fell in love with a guy and it lasted for around four years. When I thought that he is not my Mr Right and my future would not be happy with him, I parted ways with him." says Nitya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X