»   » మాటకి పెడార్థాలు తీశారు...నిత్యామీనన్

మాటకి పెడార్థాలు తీశారు...నిత్యామీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలా మొదలైంది చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నిత్యా మీనన్ తాజా చిత్రం సెగ. ఆ చిత్రం ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ...స్వతహాగా మనసులో ఏదీ దాచుకోని మనస్తత్వం నాది. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడటం నాకు చేతకాదు. వాస్తవంగా ఇలాంటి మనస్తత్వం ఉండటం మంచిదే.కానీ బయట మాత్రం ఎన్నో చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇటీవల ఓ విషయంలో నాకిలానే జరిగింది. ననన్న మాటకి పెడార్దాలు తీసారు అంది. ఈ మాట విన్న వారందరకీ సిద్దార్ధతో ఆమె చేసిన 180 చిత్రం ప్రమోషన్ లో ప్రభాస్ గురించి చేసిన కామెంట్ గుర్తుకు వచ్చింది. అలాగే సీనియర్ హీరోలతో చేయనని చెప్పటం కూడా గుర్తు చేసుకున్నారు.

ఈ వారంలో విడుదల కానున్న సెగ చిత్రంలో ఆమె మనస్సుకు నచ్చిన పాత్రను చేసానంటోంది. అలా మొదలైంది కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో రూపిందిన వెప్పం చిత్రానికి రీమేక్. తెలుగు ప్రేక్షకులకు అశోక్‌ వల్లభనేని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఆవకాయ బిర్యాని ఫేమే బిందు మాధవి ఓ కీలకపాత్రను పోషించింది. ఈ చిత్రం డైరక్ట్ చేసింది అంజన అనే మహిళా దర్శకురాలు. దర్శకురాలు ఈ చిత్రం గురించి చెపుతూ..ప్రేమంటే లక్ష్యాన్నీ, భవిష్యత్తునీ నిర్దేశించేది. మా సినిమాలోనూ ఓ ప్రేమ జంట ఉంది. ఆ ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో? చివరి మజిలీ ఏమిటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటోంది.

English summary
Nani, Bindu Madhavi and Nithya Menon starrer Sega, dubbed version of Tamil film Veppam, is finally hitting the screens. Now the film is releasing in both the languages simultaneously on July 29th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu