»   »  రేప్ విక్టిమ్‌గా నిత్యా మీనన్

రేప్ విక్టిమ్‌గా నిత్యా మీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తన బబ్లీ యాక్టింగ్‌, చలాకీతనంతో తెలుగునాట సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళీ భామ నిత్యా మీనన్ త్వరలో రేప్ బాధితురాలిగా తెరపై కనిపించబోతోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. '22 ఫిమేల్ కొట్టాయం' అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

రేప్‌కు గురైన నర్సు ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. తొలుత ఈచిత్రం చేయడానికి ఆసక్తి చూపని నిత్యా మీనన్....ఈ చిత్రాన్ని లేడీ దర్శకురాలు హ్యాండిల్ చేస్తుండటంతో చేయడానికి తన అంగీకారాన్ని తెలిపింది. శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది. శ్రీప్రియ గతంలో అంతులేని కథ చిత్రంలో నటించింది.

ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. జూన్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇటీవల నితిన్‌‌తో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో హిట్ కొట్టిన నిత్యా...ప్రస్తుతం 'ఏమిటో ఈ మాయ' చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది. '

English summary

 Nitya Menon who has got a good response for her performance in recent hit movies like Ishq, Gundejari Gallanthayyinde and many others. Latest buzz that she agreed for a Sandalwood super hit rape victim revenge movie in Tamil and Telugu. She initially not accepted but the director Is a lady who is actor and now becomes directors.
Please Wait while comments are loading...