»   » అనుష్క కూతురుగా నిత్యా మీనన్!

అనుష్క కూతురుగా నిత్యా మీనన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘రుద్రమదేవి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర దర్శక నిర్మాతలు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నిత్యా మీనన్(పాత్ర పేరు ముమ్మిడమ్మ) అనుష్క(రుద్రమదేవి)-రానా(చాళుక్య వీరభద్ర) కూతురు పాత్రలో నటిస్తుందట. ఇక కాథరిన్ ఈచిత్రంలో రుద్రమదేవి స్నేహితురాలైన అనామిక పోషిస్తోంది. అనామిక గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్)ని ప్రేమిస్తుందట. ఈ వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

Nithya Menon

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న రుద్రమదేవి ఆడియో వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 21న విశాఖపట్నంలో, 22న వరంగల్‌లోని కాకతీయుల కోటలో ఈ చిత్ర ఆడియో రిలీజ్ చేయాలని నిశ్చయించారు. విశాఖలో జరిగే ఆడియో వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును, వరంగల్ లో జరిగే ఆడియో వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వారి డేట్స్ కోసం గుణశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా....నిత్యామీనన్, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
The role being played by Nitya menon was 'Mummidamma', who is nothing but Queen Rudrama devi and King Chalukya Veera Bhadra's elder daughter. So Nitya should be Anushka,Rana's daughter.
Please Wait while comments are loading...