twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యామీనన్ 'కర్మయోగి' చిత్రం త్వరలో...

    By Srikanya
    |

    నిత్యామీనన్, ఇంద్రజిత్ జంటగా కాంబినేషన్ లో మళయాళంలో రూపొందిన'కర్మయోగి'చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానుంది. మలయాళంలో ఇదే పేరుతో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది తెలుగు డబ్బింగ్ రూపం. ఇందులో నిత్య కనబర్చిన అభినయానికి మల్లూవుడ్ ప్రేక్షకులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. శకుంతల ఆర్ట్స్ పతాకంపై ప్రకాష్‌రావు సనపల సమర్పణలో రాజశేఖర్ సనపల ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రకాశ్‌రావు సనపల సమర్పిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పనులు హైదరాబాద్‌లోని బాలాజీ సినీ స్టూడియోలో ప్రారంభమయ్యాయి.

    ఈ సందర్భంగా నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ "మహాకవి, రచయిత షేక్‌స్పియర్ రాసిన 'హామ్లెట్' నాటకం ఆధారంగా రూపొందించిన గొప్ప పీరియాడికల్ సినిమా 'కర్మయోగి'.ఈ చిత్రాన్ని వీకే ప్రకాష్ అద్భుతంగా తెరకెక్కించారు. పలు చలన చిత్రోత్సవాల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇంద్రజిత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటి పద్మిని కొల్హాపురి ఓ ముఖ్య పాత్ర చేశారు. నిత్యా నటన, ఇంద్రజిత్ చేసిన మల్లయుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి'' అని చెప్పారు.

    ఇక 'కర్మయోగి' చిత్రంలో అత్యద్భుతమైన మల్లయుద్ధ సన్నివేశాలు హైలైట్. నిత్యామీనన్ నటన ఎస్సెట్. గోవాలో నిరుడు జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ చిత్రానికి అందరినుంచీ ప్రశంసలు లభించాయి. సైజు కురుప్పు, అశోకన్, తలైవాసల్ విజయ్, మణికుట్టన్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఔస్‌పచ్చన్, ఛాయాగ్రహణం: ఆర్.డి. రాజశేఖర్, స్కీన్‌ప్లే, దర్శకత్వం: వి.కె. ప్రకాశ్.

    నిత్యామీనన్ విషయానికి వస్తే ప్రస్తుతం తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఆమె అంగీకరిస్తోంది. తెలుగులో ఆమె నితిన్ హీరోగా చేసిన ఇష్క్ చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో ఇక్కడ కూడా వరస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తన కన్నా హైట్ బాగా ఎక్కువ ఉన్న హీరోల ప్రక్కన చేయనని,సీనియర్ హీరోలు,వయస్సు పెద్దవాళ్ల ప్రక్కన చేయనని ఆమె తెగేసి చెప్పటంతో కొన్ని ఆఫర్స్ ప్రక్కకు వెళ్తున్నాయి. అయితే ఆమెకంటూ తెలుగులో ప్రత్యేకమైన మార్కెట్ ఉండటంతో ఆమె చేసిన డబ్బింగ్ సినిమాలకు మంచి గిరాకి ఏర్పడింది.

    English summary
    
 Karmayogi is a 2012 Malayalam film directed by V. K. Prakash, starring Indrajith, Nithya Menon, Padmini Kolhapure, Saiju Kurup, Ashokan, Thalaivasal Vijay and Manikuttan. The film is an adaptation of Shakespeare's Hamlet. Indrajith plays the protagonist in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X