»   » నిత్య మీనన్ కొత్త చిత్రం '50% లవ్‌'

నిత్య మీనన్ కొత్త చిత్రం '50% లవ్‌'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్యన నాగచైతన్య,తమన్నా కాంబినేషన్ లో '100% లవ్‌'అనే చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి టైటిల్ తోనే నిత్యా మీనన్ ప్రధానపాత్రలో రూపొందిన '50%లవ్‌'అనే చిత్రం తెలుగులో రాబోతోంది. శిబి మలైయిర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... ''సంగీత ప్రధానమైన ప్రేమ కథా చిత్రమిది. హీరో,హీరోయిన్ మధ్య సప్తస్వరాలు ఎలా తోడ్పడ్డాయో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. సున్నితమైన భావోద్వేగాల మేళవింపుగా తీర్చిదిద్దాం. ఈ కథకు 50% లవ్‌ అనే పేరు ఎందుకుపెట్టామనేది సస్పెన్స్‌'' అన్నారు.

నిషాన్‌, అభిలాష్‌, అసీఫ్‌ అలీ, హిమా, వినయన్‌ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. మాటలు, పాటలు: బి.భారతీబాబు, కూర్పు: ముత్యాల నాని, ఛాయాగ్రహణం: అజయన్‌ విన్సెంట్‌.

English summary
Nithya Menon plays female lead role in an upcoming film titled 50% Love.
Please Wait while comments are loading...