»   » ఆ స్టార్ హీరోల సినిమాల్లో 'అలా మొదలైంది' నిత్యా మీనన్

ఆ స్టార్ హీరోల సినిమాల్లో 'అలా మొదలైంది' నిత్యా మీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన నిత్యా మీనన్ కి తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది. పెద్ద హీరోల సరసన చేయటానికి ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో అడిగినట్లు తెలుస్తోంది. అలాగే ఆమె సిద్దార్ద సరసన '180' అనే చిత్రం కమిటైంది. మరో రెండు చిత్రాల్లో ఆమెను ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ప్రస్తుతం నేను '180'అనే ఓ సినిమాలో నటిస్తున్నాను. అందులో సిద్దార్థ్‌ హీరో. సినిమా పేరు చూసి అదేదో థ్రిల్లర్‌ అనుకోవద్దు. అది ఓ ప్రేమ కథే. అలాగే ఓ ప్రముఖ సంస్థ నిర్మించే చిత్రానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను అంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu