»   » నాపై రేప్ సీన్ తీస్తున్నప్పుడే... : నిత్యామీనన్

నాపై రేప్ సీన్ తీస్తున్నప్పుడే... : నిత్యామీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రేప్ సీన్ లో నటించడానికి సంకోచించానని నటి నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమెతో ఓ మళయాళ రీమేక్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 22 Female Kottayam అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తమిల,తెలుగు భాషల్లో రీమేక్ అవుతోంది. ఇక ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా నడుస్తుంది. తనను మోసం చేసిన వారిపై హీరోయిన్ తీర్చుకునే పగ,ప్రతీకారం ప్రధానాంసంగా ఉంటుంది. మళయాళంలో ఈ చిత్రం బాగా ఆడింది. గత కాలం హీరోయిన్ శ్రీప్రియ ఈ చిత్రం రీమేక్ వెర్షన్ డైరక్ట్ చేస్తోంది.ఈ చిత్రం కోసం బలాత్కార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ముంబయిలో మహిళ ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడం దిగ్భ్రాంతిని కలిగించిందని నిత్యామీనన్ పేర్కొంది.

నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించమని శ్రీప్రియ అడిగినప్పుడు ఆలోచించానంది. అయితే మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటించడం వలన తన సంకోచం పోయిందని చెప్పింది. మహిళలపై బలాత్కారానికి పాల్పడేవారు ఈ చిత్రం చూస్తే అలాంటి చర్యలకు పాల్పడరని అంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మానవ మృగాల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.


మల సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో రూపొందుతోంది. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తోంది. నిత్యామీనన్ కి తెలుగులోనూ మార్కెట్ ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది.

ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. జూన్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవల నితిన్‌‌తో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో హిట్ కొట్టిన నిత్యా...ప్రస్తుతం 'ఏమిటో ఈ మాయ' చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది. '

English summary
In the recent times, Nithya Menon is winning a lot of big offers following her colossal performance in National award winning film Ustad Hotel. The actress is now signed for the remake of blockbuster Malayalam movie #22 Female Kottayam that starred Riima Kallingal in female lead with director Fazil’s son Fahadh playing the hero character. Yesteryear actress Sripriya has now bought the remake rights of this film and the shooting will go on floors soon. This is a suspense story that begins with a romantic feel with unexpected twists that lies between love, betrayal and friendship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu