twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చెత్త సినిమా' అంటుంటే చాలా ఫీలయిపోయింది : నితిన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒకసారి నేను చేసిన ఓ సినిమాకి వెళ్లింది. థియేటర్‌ నుంచి బయటికి వస్తుంటే 'చెత్త సినిమా' అని ఆడియన్స్‌ అంటుంటే చాలా ఫీలయిపోయింది. ఇంటికొచ్చి నన్ను కూర్చోబెట్టుకుని 'నువ్వు ఇలాంటి సినిమాలు చేయాలి, ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి' అంటూ నేను ఎలాంటి పాత్రలు అయితే నాకు నప్పుతాయో చెప్పింది అంటూ చెప్పుకొచ్చారు నితిన్.

    నితిన్...తాజా చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే సూపర్ హిట్టైన నేఫద్యంలో ఆయన మీడియాతో తన ఆనందం పంచుకుంటూ ఫ్యామిలీ విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే.... మా అక్క నిఖితా రెడ్డి. చిన్నప్పుడు అక్కా, నేను చాలా కొట్టుకునే వాళ్లం. ఎంతగా అంటే ఒక్కోసారి గిచ్చుకుంటే రక్తాలు వచ్చేసేవి. ఎవరైనా అక్కాతమ్ముళ్లు అనుకునే వారు కాదు, శత్రువుల్లా ఉండేవాళ్లం. అయితే మా అక్కకి మనసులో మాత్రం నేనంటే చాలా ఇష్టం అన్నారు.

    ఇక తను కొడుతుంది, తిడుతుంది, అదే వేరేవాళ్లెవరైనా నన్ను ఏమైనా అంటే అస్సలు వూరుకోదు. వాళ్లతో పెద్ద గొడవ పెట్టేసుకుంటుంది. నా సినిమాకు తనే మంచి క్రిటిక్‌. బాగా చేసినా, చేయకపోయినా విశదీకరించి చెప్పేస్తుంది. తను చెప్పే విషయాలు నటన విషయంలో నాకు చాలా ఉపయోగపడేవి. నా సినిమా ఫెయిలైతే నా కన్నా తనే ఎక్కువ బాధపడేది.మా అక్క ఇచ్చే సలహాలు నాకు ఉపయోగపడ్డాయి. అక్కలో పట్టుదల ఎక్కువ. అమ్మలాగే కష్టపడుతుంది కూడా అన్నారు.

    అలాగే....మొదటిసారి సినిమారంగంలో అడుగుపెట్టింది. అమ్మాయి ఏం చేయగలదు అని మాట్లాడిన వాళ్లు ఆశ్చర్యపోయేలా పని చేసింది. కాస్ట్యూమ్‌ దగ్గర నుంచి లొకేషన్‌ దాకా అన్ని విషయాలూ తెలుసుకుంది. మొదటి సినిమాతోనే నాకంతా తెలియక పోవచ్చు, కానీ వీలైనంత తెలుసుకుంటాను అని సమయాన్ని పట్టించుకోకుండా పనిచేసింది. అక్క పట్టుదల నాకెంతో ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది. సినిమాలో నా కాస్ట్యూమ్స్‌ బాగున్నాయో లేదో చూడడం, లేదా మార్పులు చేయడం దగ్గరుండి చేస్తుంటుంది అని చెప్పుకొచ్చారు.

    English summary
    Nitin says that his mother is the best Critc to his Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X