»   » ఆ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసి చేస్తున్నారా?

ఆ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసి చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండటం సర్వ సాధారణం. అయితే సినీ సెలబ్రిటీల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో వీర ఫ్యాన్స్ ఎవరంటే నిర్మాత బండ్ల గణేష్, యంగ్ హీరో నితిన్. ఈ ఇద్దరు సందర్భం ఏదైనా తాము పవర్ స్టార్ అభిమానులం అంటూ ఎలాంటి మొహమాటం చెప్పుకునే రకం. వీరిలో ఒకరు పవర్ స్టార్ ఇన్స్‌స్పిరేషన్ గా సినిమాల్లోకి వస్తే.... మరొకరు ఆయన సపోర్టుతో నిర్మాత అయ్యారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... కలిసి సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా సినిమా చేయాలని బండ్ల గణేష్ ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు కొన్ని రోజులుగా నితిన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నితిన్ ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదని టాక్.

Nitin- Bandla Ganesh Combo Soon

ప్రస్తుతం నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో...
నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ.. సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్' ఫేం) ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.

కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Film Nagar source said that, Nitin and Bandla Ganesh to team up soon.
Please Wait while comments are loading...