»   » నితిన్ మ్యాటర్ రూమర్ కాదు నిజమే

నితిన్ మ్యాటర్ రూమర్ కాదు నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ తో ఓ సారి ఓ చిత్రం చేసిన దర్శకుడు మళ్లీ మళ్లీ చేయటానికి ఆసక్తి చూపుతాడు. అలాంటిదే హీరో నితిన్ కూడా రిపీట్ చేస్తున్నాడు. కొద్ది కాలం క్రితమే పూరి తో హార్ట్ ఎటాక్ చేసిన నితిన్ మరోసారి ఆయనతో పనిచేయటానికి సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఖరారు చేసారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. వన్ ఇండియా తెలుగు సైతం ..త్వరలో నితిన్, పూరి కాంబినేషన్ అంటూ వార్త ఇచ్చింది. గాసిప్ అని చాలా మంది భావించిన ఈ వార్త ఇప్పుడు నిజమై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే పూరి లాంటి దర్శకుడుతో ఇంకో చిత్రం చేయాలనుకుని హీరోలు కోరుకోవటం మాత్రం ఆశ్చర్యపోయే విషయం మాత్రం కాదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇటీవల 'చిన్నదాన నీకోసం' అంటూ సందడి చేసిన ఆయన తదుపరి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. 'నా అభిమాన దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్‌తో మరో చిత్రం చేస్తున్నా'నని స్వయంగా వెల్లడించాడు నితిన్‌. వీరి కలయికలో ఇదివరకు 'హార్ట్‌ ఎటాక్‌' తెరకెక్కింది. తన కొత్త సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానని నితిన్‌ తెలిపాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు.

Nitin confirms next with Puri Jagan

ప్రేమకథలతోనే మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న హీరో నితిన్‌. 'జయం', 'దిల్‌', 'సై', 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే' తదితర చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నాడు. ఒకపక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క నిర్మాతగా కూడా మారాడు. అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ నితిన్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.


చిన్నదాన నీ కోసం చిత్రం తర్వాత అనేక స్క్రిప్టులు విన్న నితిన్ ఈ ఒక్క ప్రాజెక్టుని మాత్రమే ఓకే చేసాడని తెలుస్తోంది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క పూరి జగన్నాథ్..వరుణ్ తేజ తో ఓ చిత్రం,టెంపర్ రీమేక్ చిత్రాలు కమిటయ్యి ఉన్నారు. అన్నీ బాగుంటే చిరంజీవి 150 చిత్రంగా తన దగ్గర ఉన్న ఆటో జానీ చిత్రం చేస్తారు.

జ్యోతిలక్ష్మీ విషయానికి వస్తే...

ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ముహూర్తం జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సెక్సీ ఇమేజ్ ని షేర్ చేస్తూ ముహూర్తం జరిగిందని తెలియచేసింది.

ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. జూనియ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా పూర్త‌వ‌టంతో త‌న భ‌విష్య‌త్ సినిమాల ప‌నిలో ప‌డిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు. త‌ను ఛార్మీ తో తీయ‌బోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్ల‌డించాడు. అయితే ఈ సినిమా నర్త‌కి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించాడు.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.

English summary
Nitin said, “Happy to announce and share with you all that I’m doing my next film with one of my favourite director Puri Jagan sir”. Though this news is heard from a time, none have confirmed it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu