సమ్మర్‌లో జ్వాలా గుత్తా హాట్‌గా..

By Pratap

హైదరాబాద్: నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన గండె జారి గల్లంతయ్యిందే సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్, నిత్య మీనన్ జంటగా విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గుండెజారి గల్లంతయ్యిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ - "గండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరమ పూర్తయింది. ఈ వారంలో పాటలను విడుదల చేస్తాం. సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వండర్ ఫుల్ టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తోంది. ఇష్క్ లాంటి హిట్ అనంతరం మళ్లీ మా బ్యానర్‌పై ఓ చక్కని కుటుంబ కథా చిత్రా్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం" అని వివరించారు.

"నితిన్ - నిత్యల కెమిస్ట్రీ మరోమారు ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలబెడుతుంది. అలాగే గుత్తా జ్వాల చేసిన సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. హాట్ సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా కూల్ ఎంటర్‌టైన్‌గా అందరినీ ఎంటర్‌టైన్ చేయడం ఖాయం" అన్నారు.

మధునందన్, అలీ, ఆహుతి ప్రసాద్, సంధ్య జనక్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. పాటలు: కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్, మాటలు, స్క్రీన్‌ప్లే: హర్షవర్ధన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X