For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  న్యూ లవ్ స్టోరీ (గుండె జారి గల్లంతయ్యిందే ప్రివ్యూ )

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇష్క్ తో హిట్ కొట్టి మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకున్న నితిన్ మరో ప్రేమ కథతో ఈ రోజు(శుక్రవారం)ముందుకొస్తున్నాడు. అలాగే ఇష్క్ లో తన విజయానికి తోడుగా నిలిచిన నిత్యా మీనన్ ని కూడా తోడు తెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ని సెంటిమెంట్ గా భావించి తొలి ప్రేమలో సాంగ్ ని రీమిక్స్ చేయటం, ఖుషీ సీన్ వాడటం వంటివి చేసి అలరించే ప్రయత్నం చేయనున్నాడు. నితిన్ కెరీర్ లోనే ఎక్కువ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం ఏ రేంజి సక్సెస్ పొందుతుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

  కథలో ....తెలివైన కుర్రాడు కార్తీక్‌ (నితిన్‌). సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అమ్మానాన్నలు మాత్రం అమెరికాలో ఉంటారు. తొలి చూపులో పుట్టేదే ప్రేమ అనేది అతని నమ్మకం. ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు శ్రావణి (నిత్య మీనన్‌). సున్నిత మనస్తత్వమున్న యువతి. తన కోసమే పుట్టిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆలోచన. ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా నడుచుకొనే మరో యువతి శ్రుతి (ఇషా తల్వార్‌). కార్తీక్‌, శ్రావణి, శ్రుతిల మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? కార్తీక్‌ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

  దర్శకుడు మాట్లాడుతూ ''ముక్కోణపు ప్రేమ కథ ఇది. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. నితిన్‌ని కొత్త తరహాలో చూపించే ప్రయత్నం చేశాం. పవన్‌కల్యాణ్‌ 'తొలిప్రేమ'లోని పాట రీమిక్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. జ్వాలా నర్తించిన ప్రత్యేకగీతం అలరిస్తుంది''అన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ-''ఇష్క్‌..హిట్‌ తర్వాత మా బేనర్‌నుంచి వస్తున్న చక్కని కుటుంబ కథాచిత్రమిది. నాయకానాయికల కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్‌ వసూళ్ల పరంగా టాప్‌లో నిలబెడుతుంది. గుత్తా జ్వాల చేసిన సాంగ్‌ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు సహా ట్రైలర్స్‌కి విశేష స్పందన వచ్చింది. తొలిప్రేమ'లోని పవన్‌కళ్యాణ్‌ పాట కోసం నితిన్‌ చాలా ఎఫర్ట్‌ పెట్ట పనిచేశారు. ఆ పాటకి చక్కని స్పందన వస్తోంది'' అన్నారు.

  సంస్థ: శ్రేష్ఠ్‌ మూవీస్‌

  నటీనటులు: నితిన్‌, నిత్య మీనన్‌, ఇషా తల్వార్‌, గుత్తా జ్వాల, అలీ, తాగుబోతు రమేష్‌, ఆహుతి ప్రసాద్‌, రవిబాబు, సుధ, దువ్వాసి మోహన్‌, మధునందా తదితరులు.

  సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

  కెమెరా: ఆండ్రూ బాబు,

  పాటలు: కృష్ణచైతన్య,

  డాన్స్‌: శేఖర్‌,

  మాటలు-కథనం: హర్షవర్ధన్‌,

  కళ: రాజీవ్‌నాయర్‌.

  నిర్మాత: నిఖితారెడ్డి

  దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా

  విడుదల: శుక్రవారం.

  English summary
  Success of his film Ishq, Telugu actor Nitin Kumar Reddy is all set to dazzle the screens with his latest outing Gunde Jaari Gallanthayyinde (GJG), which is slated to release in theatres on April 19. The actor, who has pinned lot of hopes on this film, says that it is totally a different attempt, especially the comedy portions, which he describes as a 'confused comedy'.
 Related Articles
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X