»   »  మరో జీరో (హీరో స్మాల్ రివ్యూ)

మరో జీరో (హీరో స్మాల్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Hero
నితిన్ వరస ఫ్లాఫుల నుండి కోలుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు. తాజాగా సుధాకర్ నాయుడు(జివి)దర్శకత్వంలో హీరో అనే చిత్రంలో చేసాడు. పోలీస్ అకాడమీ సినిమాల కామెడీ సీన్స్ ని లిఫ్ట్ చేసి అల్లుకున్న ఈ కథనం...కథ లేక చప్పపడిపోయింది. ఎన్నుకున్న పాయింట్ లోనే లోపం ఉండటమే సినిమాకు మైనసైంది.దాంతో ఏ వర్గానికి నచ్చని పట్టని సినిమాగా మిగిలిపోయే అవకాశం ఉంది.


కథలో రాధా కృష్ణ(నితిన్) పోలీస్ కమీషన్ నాగేంద్ర నాయుడు(నాగబాబు),సరళ(కోవై సరళ) ముద్దు బిడ్డ. ఎప్పుడూ కేరలెస్ గా తిరిగే అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అతని తండ్రి కోరిక,అలాగే తల్లికి ఆ కోతి బుద్దులు చూసి మచ్చటపడి తెలుగు హీరో అయితే షైన్ అవుతాడని ఆవిడ ఆశ్వదరిస్తుంది. ఏది నిర్ణయం చేసుకోవాలో తెలియని డైలమాలో (హీరో కాదు...మనం) ఉన్న స్ధితిలో స్టేట్ హోమ్ మినిస్టర్ (బాబు మోహన్) ఓ జీవో పాస్ చేస్తాడు. నిజాయితీతి తో ఉండే ప్రతీ ఒక్కరూ పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి దేశానికి సేవ చెయ్యమని. ఆ పద్దతిలో చాలా మంది తిరుపతి ప్రకాష్,టార్జాన్,ప్రియాంక,సత్యం రాజేష్,బ్రహ్మానందం,శ్రావణ సంధ్య,నితిన్ జాయిన్ అవుతారు. అలాగే అందరితో పాటు హీరోయిన్ కృష్ణవేణి(భావన)కూడా జాయిన్ అవుతుంది. ఇక ఆ అకాడమీ హెడ్ (రమ్యకృష్ణ). ఈ ట్రైనింగ్ లో రకరకాల కామెడీలు పోలీస్ అకాడమీ సీరిస్ నుండి కట్టకట్టుకుని దిగుతాయి. అప్పుడు హీరోయిన్ నక్సలైట్ అనే విషయం టీవీ న్యూస్ ద్వారా బయిటపడుతుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది మిగతా సినిమా. అసలు ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎవర్నిపడితే వార్ని పోలీస్ అకాడమీలో ఎందుకు జాయిన్ చేసుకుంటారనేది మాత్రం ఎక్కడయినా ఉంటుందా అంటే ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవటం కష్టం.

పోలీస్ అకాడమీ సీరిస్ కామెడికి ఉద్దేశించినవి. అలాంటి వాటిల్లో ఏవైనా జరగచ్చు. ఏం చూపినా కేవలం ఎంజాయ్ మెంట్ కే కాబట్టి ప్రేక్షకుడూ లాజిక్స్ వెతక్కుడా బుర్ర మూసుకుని చూస్తాడు. అయితే అదే హీరో కి శాపం అయింది. ఓ మామూలు రెగ్యులర్ మశాలా చిత్రంలా ఈ చిత్రం దిగింది. దాంతో ఇలాంటి ఇల్లాజిక్ పాయింట్స్ ఎత్తుకోవటంతో సీరియస్ సినిమా చూద్దామని కూర్చున్న ప్రేక్షకుడు విసుగెత్తిబోయాడు. జెనర్ స్పెసిఫిక్ చేసుకోవటం చేతకాక పోతే ఇంతే సంగతులు అని ఈ సినిమా చెబుతుంది. అదే అల్లరి నరేష్ సినిమాలో ఇలాంటి పాయింట్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే అవగాహనా రాహిత్యంతో ప్రెజెంట్ ఇష్యూ అయిన నక్సలిజం ఎత్తుకోవటం మరో మైనస్ అయ్యింది.

నటీనటుల్లో నితిన్ రెగ్యులర్ నేర్చుకున్నదీ లేదు...పోగొట్టుకున్నదీ లేదు. భావన ఈ సినిమాకీ ఒరగపెట్టిందేమీలేదు. ఇక డైరక్టర్ తన ప్రతిభ మొత్తం హీరోని స్టైలిగా చూపటం లోనే సరిపెట్టాడు. దాంతో ప్రతీ సీన్ హీరో ఇంట్రడక్షన్ లా మారి పోయింది. ఇక కొవై సరళ,కోట కామెడీ అలరించటం లేదు. రమ్యకృష్ణ టాలెంట్ పెళ్ళయ్యాక ఏమైందో అర్ధం కాని స్ధితి. ఇక సినిమాలో మొయిన్ కీలక పాత్ర చేసిన నాగబాబు ఎప్పటిలాగే పెద్ద శ్రమ అనుకోకుండా అవే ఎక్సెప్రెషన్స్ తో సరిపెట్టేసాడు.

ఏదిఏమైనా ఈ సినిమాకు వెళ్ళటం కన్నా పోలీస్ అకాడమీ సీరిస్ మరో సారి తెచ్చుకుని టీవీలో చూడటం మేలు. ఇక నితిన్ కి వరస ప్లాపులు(రామ్,టక్కరి,ధైర్యం,ఆటాడిస్తా)తర్వాత ఇది కాబట్టి పెద్ద భాధేం లేదు.అతను మాస్ హీరో అనిపించుకోవాలన్న ఆసక్తి తగ్గితే తప్ప హిట్టు రావటం కష్టమనే విషయం రుజువు చేస్తుందీ చిత్రం. అంతే

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X