»   » కారు ప్రమాదం నుంచి బయటపడి.. ఇప్పుడు అకాల మరణం..

కారు ప్రమాదం నుంచి బయటపడి.. ఇప్పుడు అకాల మరణం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో కారు ప్రమాదం నుంచి తప్పించుకొన్న ప్రముఖ సినీ నటి జయసుధ భర్త, నిర్మాత నితిన్ కపూర్ ప్రస్తుతం అకాల మరణం చెందడంపై పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 2013లో నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి వద్ద నున్న ఫ్లైఓవర్‌పై అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకొన్న కారు పూర్తిగా దగ్ధమైంది.

అయితే, నితిన్ కపూర్‌తో పాటు కారులోని వారి పనిమనిషి, డ్రైవర్ ప్రమాదంనుంచి బయుటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే కారులో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Nitin Kapoor safely escaped from car accident.. but..

కాగా మంగళవారం (మార్చి 14వ తేదీ సాయంత్రం నితిన్ కపూర్ ముంబైలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్టు తెలుస్తున్నది. నితిన్ మరణ వార్త తెలుసుకొన్న జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లారు.

English summary
Actress Jaysudha husband nitin kapoor no more. He was safely escaped a car accident several years ago. Latest news that nitin kapoor committed suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu