»   » నితిన్‌తో మూవీ, పాప దొరకక కరుణాకరన్ పాట్లు!

నితిన్‌తో మూవీ, పాప దొరకక కరుణాకరన్ పాట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nitin, Karunakaran movie latest updates
హైదరాబాద్: ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాల వరుస విజయాలతో హాట్రిక్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలో 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మార్చి నెల మొదటి వారంలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.

ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు దర్శకుడు కరుణాకరన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంత వరకు హీరోయిన్ ఖరారు కాలేదు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోయిన్లు సంప్రదించినా వర్కౌట్ కాలేదని ఫిల్మ్ నగర్ టాక్. నితిన్‌కు సరిపోయే భామను వెతికేందుకు కరుణాకరణ్ చాలా కష్టపడుతున్నాడని చర్చించుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని నితిన్ సొంత బేనర్లో తెరకెక్కించనున్నారు. బడ్జెట్ గురించి ఏమాత్రం వెనకాడకుండా సినిమాను గ్రాండ్‌గా తీయాడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రం గతంలో తొలి ప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన కరుణాకరన్ నితిన్ కోసం మంచి కథను రెడీ చేసాడు.

నితిన్ ప్రస్తుతం గౌతం మీనన్ నిర్మిస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం షూటింగ్ పూర్తి కానుంది. దీని తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పట్టాలెక్కబోతోంది.

English summary

 Karunakaran, Nitin movie shooting will start in the first week of March. Except for the heroine, everything got finalised and the makers are now desperate to rope a leading lady as the launch is getting delayed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu