»   » బూజు దులిపి రిలీజ్ చేస్తున్న నితిన్ సినిమా

బూజు దులిపి రిలీజ్ చేస్తున్న నితిన్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వయొలెంట్ బట్ సైలెంట్' అనే ఉప శీర్షికతో నితిన్, మీరా చోప్రా జంటగా రూపొందిన 'మారో' చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చాలా సంవత్సరాలుగా రకరకాల సమస్యలతో ఈ చిత్రం డబ్బాల్లో మగ్గుతోంది. రిలీజ్ మలయాళ దర్శకుడు సిద్ధిక్ నేరుగా తెలుగులో రూపొందించిన తొలి చిత్రమిదే. ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా నిర్మాతలు మామిడాల శ్రీనివాస్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..."మలయాళంలో అపజయం ఎరుగని దర్శకుడు సిద్ధిక్‌. ఆయన తొలిసారి తెలుగులో చేసిన చిత్రం 'మారో'. మైండ్‌గేమ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో జయం, దిల్‌, సై కోవకు చెందుతుంది. ఐఐటి విద్యార్థిగా నితిన్‌ పాత్ర రూపకల్పన యువతరాన్ని ఉరూతలూగిస్తుంది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తాం' అని తెలిపారు. అబ్బాస్‌, కోట శ్రీనివాసరావు, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, చలపతిరావు, నరసింహరాజు, తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: చింతపల్లిరమణ, సంగీతం: మణిశర్మ, కెమెరా: జయరామ్‌, సహ నిర్మాతలు: ఎస్‌.అనిల్‌ కుమార్‌, డి.శైలేందర్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu