twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూజు వదిలించుకుంటున్న నితిన్ చిత్రం

    By Srikanya
    |

    రెచ్చిపో అంటూ డిజాస్టర్ చిత్రం ఇచ్చిన నితిన్ 2010 జనవరిలో 'మారో' (వయలెంట్‌ బట్‌ సైలెంట్‌) అనే చిత్రంలో ముందుకొస్తున్నాడు. దాదాపు మూడేళ్ళ క్రితం ప్రారంభమై రకరకాల కారణాలతో ఆగిపోయి..మళ్ళీ ఇంత కాలానికి బూజు వదిలించుకుని ఈ చిత్రం బయిటకు వస్తోంది. జనవరి రెండవ వారంలో ఈ చిత్రంలో ఈ చిత్రం రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథాంశం మైండ్‌గేమ్‌తో కూడి ఉంటుంది. ఇందులో నేను ఐఐటి విద్యార్థిగా కనిపిస్తాను. ఒక యువకుడు తన జీవితంలో ఎదురైన సమస్యలను తన బుద్ధిబలంతో ఎలా అధిగమించాడన్న అంశాన్ని ఈ చిత్రం ఎంతో ఆసక్తిగా చూపిస్తుంది' అన్నారు.

    దర్శకుడు సిద్ధిక్‌ మాట్లాడుతూ, 'నేను మలయాళంలో 9, తెలుగులో 2 చిత్రాలకు దర్శకత్వం వహించాను. నేను రూపొందించగా తెలుగులో రీమేక్‌ అయిన 'పెద్దరికం', 'హిట్లర్‌' వంటి చిత్రాలకు దీటుగా 'మారో' ఉంటుంది. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్ర విజయానికి దోహదపడే ఒక అంశం' అన్నారు. ఇక అప్పట్లో సిద్దిక్ తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఈ చిత్రం రూపొందించాడు. అయితే హీరోయిన్ మీరా చోప్రా కేసు వేయటంతో ఈ చిత్రం ఆగిపోయింది. చివరకు రాజీ కొచ్చి ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి మొదట సత్యం..శివం..సుందరం..అనే పేరు పెట్టారు. ఇప్పుడు మారో అని పెట్టి రిలీజ్ చేస్తున్నారు.

    ఈ చిత్రంలో మీరాచోప్రా, అబ్బాస్‌, కోట, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, చలపతిరావు, నరసింహరాజు, రాజా శ్రీధర్‌, రాజ్‌ కిరణ్‌, రమాప్రభ, రాజ్యలక్ష్మి, కవిత నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: మణిశర్మ, కెమెరా: జయరాం, ఎడిటింగ్‌: టిఆర్ శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి శైలేందర్‌, సహ నిర్మాత: ఎస్ అనిల్‌ కుమార్‌, సమర్పణ: వాసవి ఎం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X