»   » ‘కొరియర్ బాయ్ కళ్యాణ్‌’ లోనూ పవన్ సెంటిమెంట్

‘కొరియర్ బాయ్ కళ్యాణ్‌’ లోనూ పవన్ సెంటిమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని కావడం యంగ్ హీరో నితిన్‌కు బాగానే కలిసొస్తుంది. నితిన్ నటించిన గత సినిమా 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఆడియో పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదలకావడం, ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్‌ను నితిన్ ఇమిటేట్ చేయడం సినిమాకు ప్లస్సయింది.

నితిన్ తాజా సినిమా 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ సెంటిమెంటు రిపీట్ చేయబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ పేరు పి.కె (పనిలేని కళ్యాణ్). పవన్ కళ్యాణ్‌ను కూడా ఇండస్ట్రీలో అంతా షార్ట్‌కట్‌లో పి.కె అని పిలుస్తుంటారు. అయితే ఇది యాధృచ్చికంగా జరిగినది మాత్రమే అంటున్నాడు నితిన్.

నితిన్ మాట్లాడుతూ 'సినిమాలో నా పాత్ర పవన్ పాత్రను పోలి ఉండటం యాధృచ్చికమే. నా చివరి రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వల్లనే సక్సెస్ అయ్యాయి. కొరియర్ బాయ్ కళ్యాణ్ విషయంలోనూ అది రిపీట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆయన నా అదృష్ట చిహ్నం' అంటూ నితిన్ చెప్పుకొచ్చారు.

ఫోటాన్, కథాస్ పతాకంపై ప్రేమ్‌సాయి దర్శకత్వంలో నితిన్ కథానాయకుడుగా నిర్మిస్తున్న 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్‌కు జోడీగా యామీ గౌతమి నటిస్తోంది. నవంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ప్రేమ్‌సాయి మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఓ సరికొత్త పాత్రలో నితిన్ నటిస్తున్న ఈ చిత్రం ఆయన గత చిత్రాల్లాగే విజయవంతమవుతుందని అన్నారు. సత్యం రాజేష్, హర్ష, జైసంతానం, వి.టి.వి.గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, ఎడిటింగ్: ఆంథోనీ, కెమెరా: ఓంప్రకాష్, నిర్మాత: గౌతం వాసుదేవమీనన్, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

English summary
Actor Nitin Reddy, an ardent fan of actor Pawan Kalyan, is repeating the sentiment associated with PK in his upcoming Telugu romantic-drama Courier Boy Kalyan (CBK). He says the reference is merely a coincidence, but adds that it might work in his favour. His character in the film is called PK (Panileni Kalyan).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu