»   » పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ మూవీ 'చల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ మూవీ 'చల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'చల్ మోహన రంగ' అనే టైటిల్ ఖరారు చేశారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ‌లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా ఫస్ట్ లుక్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా ఫస్ట్ లుక్

ఈ చిత్రం ఫస్ట్ లుక్ 'చల్ మోహన్ రంగ' ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ఆదివారం ఉదయం విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. నా అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని నితిన్ తెలిపారు.

నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.

నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఏంటో సంతోషంగాఉంది. ఆయనకు మా తరపున చిత్రం యూనిట్ తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ప్రేమకుల రోజున టీజర్

ప్రేమకుల రోజున టీజర్

‘చల్ మోహన రంగ' చిత్రం టీజర్ ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న, సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల 14 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నామని తెలిపారు. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్

దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..' ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. నా ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఆనందంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

తారాగణం

తారాగణం

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య.

English summary
Nitin's Chal Mohan Ranga Movie First Look. Actor Nithiin has announced that his upcoming film with director Krishna Chaitanya will release on April 5. The actor took to Twitter and announced the first look of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu