For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా హీరోకు నితిన్ డైరక్ట్ ఎటాక్

  By Srikanya
  |

  హైదరాబాద్: నితిన్ ఇప్పుడు కొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో వరుణ్ తేజ్ కు ఎటాక్ ఇవ్వబోతున్నారు. అదే...ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల అవబోతున్నాయి. ముకుంద చిత్రం మొదట సంక్రాంతికి అనుకున్నది వెనక్కి వచ్చి క్రిసమస్ రోజు సెటిలైంది. అదే రోజుని నితిన్ సైతం వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 19న చిన్నదాన నీ కోసం చిత్రం రిలీజ్ చేయాలని నితిన్ భావించారు...అయితే ఇప్పుడు డిసెంబర్ 25 న అని అభిషియల్ గా ప్రకటించారు. రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడతాయన్నమాట.

  చిన్నదాన నీ కోసం విషయానికి వస్తే...

  ఇక ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు నితిన్. కెరీర్‌లో మంచి జోరుమీదున్న ఆయన తాజాగా మరో హిట్ పై కన్నేశారు. ఆయన ప్రస్తుతం కరుణాకరణ్ దర్శకత్వంలో చిన్నదాన నీకోసం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చాలా బాగుందంటూ అంతటా వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ మధ్య టీజింగ్ సీన్స్,ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిన్ ని దేవతలా చూపటం చూస్తూంటే నితిన్ కి తొలిప్రేమ తరహా హిట్ ఇస్తున్నాడని అంటున్నారు.

  ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

  Nitin's direct attack on Mega Hero

  శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

  అలాగే..ముకుందా చిత్రం డిటేల్స్ కు వెళితే..

  నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరో గా పరిచయం అవుతున్న చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్. ఠాగూర్‌ మధు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని డిసెంబరు 3న విడుదల చేస్తారు. చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  దర్శకుడు మాట్లాడుతూ...క్రికెట్‌, జీన్స్‌, ఫ్యాషన్‌, మల్టీప్లెక్స్‌లో సినిమా... ఈ తరం కుర్రాళ్లంటే ఇవి మాత్రమే కాదు. జీవితంపై ఓ స్పష్టత, భవిష్యత్తుపై నమ్మకం కావల్సినంత ఉన్నాయి. ఏటికి ఎదురెళ్లి, గెలిచి నిలిచే ధైర్యం ఉంది. అసాధ్యం అనే మాట చెరిపివేసే అద్భుతాలు వాళ్లకే సొంతం. అలాంటి ఓ కుర్రాడిని మా సినిమాలోనూ చూడొచ్చు అంటున్నారు శ్రీకాంత్‌ అడ్డాల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'ముకుంద'.

  అలాగే... ''కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. తొలి చిత్రమే అయినా వరుణ్‌ నటన తప్పకుండా ఆకట్టుకొంటుంది. నా కథలోని పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. మిక్కీ స్వరాలు ప్రధాన బలం'' అన్నారు.

  ''కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో శ్రీకాంత్‌ అడ్డాల తన శైలి చూపించారు. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గని చిత్రమిది. నృత్యాలు, పోరాటాల విషయంలో అభిమానులకు వరుణ్‌ ఏలోటూ చేయడు. తనకి ఇది ఓ మంచి శుభారంభం అందించే చిత్రం అవుతుంది''ని నిర్మాత చెప్పారు. నాజర్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: మణికందన్‌, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్‌

  English summary
  Nitin, who earlier planned to release his Chinnadana Neekosam on December 19th, pushed it to Christmas now. Nitin has made it official that CNK will release on December 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X