»   » ‘మనం’ స్టోరీ: హీరో నితిన్ తండ్రి వల్లే అలా...!

‘మనం’ స్టోరీ: హీరో నితిన్ తండ్రి వల్లే అలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తర్వలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన 'మనం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా మొదలు పెట్టడానికి వెనక గల ఆసక్తికర విషయం ఇటీవల నాగార్జున వెల్లడించారు. రు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వల్లనే ఈ స్టోరీ తమ దృష్టికి వచ్చిందని నాగార్జున చెబుతున్నారు.

  'మేము ముగ్గురం కలిసి నటించబోయే మల్టీ స్టారర్ సినిమా కోసం చాలా కథలు వింటున్నాం. అదే సమయంలో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి మనం స్టొరీ ఒకటి ఉంది అది మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది, ఒకసారి వినమని నన్ను అడిగారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ వచ్చి కథ చెప్పడం, అది మాకు బాగా నచ్చేయడం, సినిమా మొదలు పెట్టడం' జరిగిందని నాగార్జున తెలిపారు.

  Nitin’s father behind Manam story

  మనం చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

  అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్

  English summary
  “We were looking for a good story for a long time for our multistarrer. One day Nithiin’s father Sudhakar Reddy called me and asked me to listen to the story of Manam. He told me that the story would suit us well. We listened to Vikram Kumar’s story and liked it immediately”, said Nagarjuna.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more