»   »  'హార్ట్‌ఎటాక్‌' అర్ద శతదినోత్సవం

'హార్ట్‌ఎటాక్‌' అర్ద శతదినోత్సవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'హార్ట్‌ఎటాక్‌' . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 21కి 50రోజులు పూర్తి చేసుకుంది.

నితిన్ మాట్లాడుతూ...ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల తర్వాత వచ్చిన హార్ట్ ఎటాక్ హిట్ అయ్యి నాకు హాట్రిక్ ని అందించింది. ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్ గారు నన్ను చాలా డిఫెరెంట్ గా ప్రజెంట్ చేసారు. అనూప్ కాంబినేషన్ లో కూడా నాకు ఇది హాట్రిక్ ఫిలిం అయ్యింది. హార్ట్ ఎటాక్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రేక్షకులకు,అభిమానులకు హృదయపూర్తక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అన్నారు.

 Nitin's Heart Attack completes 50 days

హీరోయిన్ అదాశర్మ మాట్లాడుతూ...తెలుగులో నా తొలి చిత్రమే ఇంత మంచి హిట్ అవటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత మంచి అవకాసం ఇచ్చిన పూరీ జగన్నాధ్ గారికి స్పెషల్ ధాంక్స్. నితిన్ తో మళ్లీ మళ్లీ నటించాలని వుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకన్నాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలిచాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయి'' అని చెప్తున్నారు.

విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా '1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీని అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఆమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

English summary
Nithin has scored a hat trick of hits with his latest release Heart Attack which completes 50 day run at the theatres across the state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu