»   » ‘హార్ట్ ఎటాక్’ మూవీ ఎందుకు చూడాలి..?

‘హార్ట్ ఎటాక్’ మూవీ ఎందుకు చూడాలి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న నితిన్....ఈ సారి 'హార్ట్ ఎటాక్' చిత్రంతో హాట్రిక్ కొట్టాలనే ప్లాన్లో ఉన్నాడు. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం జనవరి 31న భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఆదా శర్మ నటిస్తోంది.

ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అంటూ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇలాంటపుడు 'హార్ట్ ఎటాక్' సినిమా ఎందుకు చూడాలి? అంటే అందుకు ప్రత్యేకమైన కారణాలు చెబుతున్నారు యూనిట్ సభ్యులు.

Nitin Heart Attack

ఇప్పటికే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టున్న హీరో నితిన్....ఈచిత్రంలో తన పెర్ఫార్మెన్స్ విషయంలో మరింత మెచ్యూరిటీ చూపించబోతున్నారని, ప్రేక్షకులను పూర్తి స్థాయిలో వినోద పరిచే ప్లాన్లో నితిన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని చెబుతున్నారు. తెలుగు సినిమా లవర్ బాయ్‌గా ఎదుగుతున్న నితిన్ నటించిన ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రం చూసిన అనుభూతి కలిగిస్తుందని చెబుతున్నారు.

దీంతో పాటు బాలీవుడ్ భామ ఆదా శర్మ తెలుగులో ఎంట్రీ స్తున్న సినిమా ఇది, ఆమె అందాలు....బబ్లీ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటున్నారు. నటి కేశ కంబాటితో నితిన్ చేసిన థాయ్ లాంట్ సాంగ్ కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన 'హార్ట్ ఎటాక్' ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్లు కూడా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు పూర్తి స్థాయి సంతృప్తితో బయటకు వస్తారు అంటున్నారు యూనిట్ సభ్యులు.

English summary
Telugu actor Nithiin who's riding high on the success of his back-to-back films Ishq and Gunde Jaari Gallanthayindhe is hoping for a hatrick. His next film Heart Attack which is directed by Puri Jagannadh is all set to hit theatres on January 31.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu