»   » అల్లు అర్జున్ కి అక్కడ పోటీ ఇస్తానంటున్న నితిన్

అల్లు అర్జున్ కి అక్కడ పోటీ ఇస్తానంటున్న నితిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇన్నాళ్లూ తెలుగు నుంచి మళయాళంకు వెళ్ళి హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు నితిన్ సైతం ఈ రూట్ లో ప్రయాణం పెట్టుకున్నాడు. తన సూపర్ హిట్ చిత్రం ఇష్క్ ని అక్కడ డబ్ చేసి విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నిత్యామీనన్ సైతం కేరళ అమ్మాయి కావటంతో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.


అక్కడ ఈ చిత్రం హిట్టైతే వరసగా నితిన్ సినిమాలు డబ్ చేసి,అలవాటు చేద్దామనే ఆలోచనలో నితిన్ తండ్రి ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మళయాళంలో చిత్రం టైటిల్.. 'Aye Priya'. దివ్య ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. నిత్యామీనన్ కాంబినేషన్ లో 13బి డైరక్టర్ విక్రమ్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ. చిత్రంలో అమాయకంగా కనపడటం కోసం కొంత బరువు పెరిగిన నితిన్ కి ఈ చిత్రం ఈ చిత్రం బాగా ప్లస్ అయ్యింది.

Nitin’s Ishq to release in Malayalam

ఏమి మాయ చేసావే తరహాలో సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాకు ఛాయాగ్రహణం అందించిన పి.సి శ్రీరామ్ తెరపై అద్బుతమే చేసారు. ఇక నిత్యామీనన్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా గోవా ఎపిసోడ్స్ లో ఆమె శారీలో కనపించి అదరకొట్టింది. అజయ్ ఢిఫెరెంట్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో అతను కామెడీని పండించటం జరిగింది.


అలాగే నితిన్ సోదరిగా సింధు తులాని,నితిన్ ప్రెండ్ గా అలీ వంటి సీనియర్స్ తో సినిమా ముందుకు వెళ్లిపోయింది. తాగుబోతు రమేష్ క్యారెక్టర్ బాగా ప్లస్ అయ్యింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే రొటీన్ లవ్ స్టోరీ అయినా ట్రీట్ మెంట్ పరంగా కొత్తగా స్క్ర్రీన్ ప్లే రాసుకుని ప్రెజెంట్ చేసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని ఎలా ఒఫ్పించాడు అన్న పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ప్రెష్ గా ఫీలయ్యే సీన్స్ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉండటంతో సినిమా ఘన విజయం సాధించింది.

English summary
Nithiin tasted success in 2012 with ‘Ishq’ movie and he has not looked back after that. Now this super hit romantic entertainer is getting ready to release in Malayalam as ‘Aye Priya’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu