»   » ఇంతకీ నితిన్ 'మారో' సినిమా రిజల్ట్ ఏమిటి?

ఇంతకీ నితిన్ 'మారో' సినిమా రిజల్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత ఐదు సంవత్సరాలుగా డబ్బాల్లో మగ్గిన నితిన్ 'మారో'చిత్రం ఎట్టకేలకు నిన్న (శనివారం) రిలీజైంది.మళయాళంలో ఇప్పటికీ బాడీగార్డ్ లాంటి సూపర్ హిట్స్ ఇస్తూ దూసుకుపోతున్న సీనియర్ డైరక్టర్ సిద్దికీ డైరక్ట్ చేసిన ఈ చిత్రం అందరూ ఊహించినట్లుగానే పెద్ద ఫ్లాఫై కూర్చుంది.ఇక ఇంతకాలం ఆగిన ఈ చిత్రం కథ ఏమిటీ అంటే...సిటిలో జరిగిన ఓ బ్యాంక్ దోపిడీ వెనకాల రాజ్ మోహన్(అబ్బాస్), ఒక మాజీ మంత్రి(కోట శ్రీనివాస రావు) ఉంటారు.ఆ దోపిడిలో నష్టపోయిన కుటుంబానికి చెందినవాడు సుందరం (నితిన్).తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోదలిచిన సుందరంకి ప్రియ (మీరా చోప్రా)పరిచయం అవుతుంది.

తన తెలివితో మైండ్ గేమ్ ఆడి డబ్బు తీసుకుని అమెరికా పారిపోయిన రాజ్ మోహన్ ని రప్పిస్తాడు.అక్కడనుంచి రాజ్ మోహన్ నుంచి డబ్బు ఎలా కక్కించి తన లాంటి వారికి ఎలా న్యాయం చేసాడన్నది మిగతా కథ.మొదటినుంచీ మైండ్ గేమ్ ఆధారంగా తయారైన కథ అంటూ ప్రచారమైన ఈ చిత్రంకి సినిమాలో అంత సీన్ ఉండదు.అందులోనూ ఐదు సంవత్సరాల క్రితం అల్లుకున్న కథ కావటంతో కొంత అవుట్ డేటెడ్ గా ఉంటుంది. ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం దర్శకుడుకి గానీ,హీరోకి గానీ,ని్ర్మాతకి కానీ ప్లస్ కాలేకపోయింది.నితిన్ వరస ప్లాఫ్ లలో మరొకటిగా మిగిలిపోయింది.

English summary
Nitin's Maaro with complex story threads, and well-acted comic situations. Problem is it lacks ‘something special’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu