For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నితిన్ నెక్ట్స్...కొత్త డైరక్టర్ తో ఖరారు

  By Srikanya
  |
  Nitin
  హైదరాబాద్ : నితన్ తన తదుపరి చిత్రం కోసం ఓ కొత్త దర్శకుడుని ఎంచుకున్నాడు. ఆయనే.. శ్రీనివాసరెడ్డి. సురేందర్‌ రెడ్డి దగ్గర డైరక్షన్ డిపార్టమెంట్ లో పని చేశారీయన. ఈమధ్యే నితిన్‌కి ఓ కథ వినిపించారు. నితిన్‌ కూడా ఈ సినిమా చేయడానికి పచ్చజెండా వూపేశారు. శ్రేష్ఠ్‌ మీడియా పతాకంపై నికితారెడ్డి ఈ సినిమా నిర్మిస్తారు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

  నిర్మాత మాట్లాడుతూ... ''నితిన్‌కి ఇదో కొత్త కథ. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తాము''అని నిర్మాత చెప్పారు. ఇక ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ కథ గత కొంత కాలంగా నితిన్ వద్ద, హీరో రామ్ వద్ద నలుగుతోంది. చివరికి నితిన్ తోనే ఫైనలైజ్ అయింది.

  'ఇష్క్‌'తో ఫామ్‌ అందుకొన్న నితిన్‌.. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో మరోసారి మురిపించాడు. ఈ రెండు విజయాలతో ఈ యంగ్ హీరో కెరీర్‌ రాకెట్‌ వేగం అందుకొంది. ప్రస్తుతం 'హార్ట్‌ ఎటాక్‌', 'కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌' సెట్స్‌పై ఉన్నాయి. ఈలోగా కొత్త సినిమాలూ ఒప్పుకొంటున్నారు. ఇప్పుడాయన ఈ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు.


  ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు మేర్లపాక గాంధీతో రామ్ కి అనుకున్న ప్రాజెక్టు సైతం ఇప్పుడు నితిన్ వద్దకు చేరిందని ఫిల్మ్ నగర్ సమాచారం. కథల ఎంపికలో డైలమాలో ఉన్న రామ్ ...'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' హిట్టవగానే చిత్ర దర్శకుడు గాంధీని పిలిచి కథ వినటం జరిగింది. అంతా ప్రాజెక్టు ఖరారు అవుతుంది,రామ్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనుకున్నారు. కానీ కథలో రామ్ చెప్పిన మార్పులు,చేర్పులు చెయ్యటం కన్నా హిట్ లలో ఉన్న హీరో నితిన్ తో వెళ్లటం బెస్ట్ అని దర్శకుడు నిర్ణయం తీసుకుని జంప్ అయిపోయినట్లు చెప్తున్నారు.


  మరో ప్రక్క మహిళా దర్శకురాలు బి.జయ ఆ మధ్యన ఓ స్క్రిప్టుని హీరో సునీల్ కోసం రెడీ చేయించింది. పూర్తి ఫన్,కొద్దిగా యాక్షన్ తో సాగే ఆ స్క్రిప్టుని సునీల్ చేస్తానని మాట ఇచ్చి నెలలు తరబడి గెంటుకు వస్తున్నాడు. దాంతో రీసెంట్ గా నితిన్ ని కలిసిన బి.జయ నేరేట్ చేయటం జరిగిందని, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే నితిన్ కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు. మరి డేట్స్ ఎలా కేటాయిస్తాడో చూడాలంటున్నారు.

  ఇక పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌' విడుదలకు సిద్దంగా ఉంది. నితిన్‌, అదాశర్మ జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. చిత్రాన్ని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''పూరి జగన్నాథ్‌గారితో ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది. 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం నా ప్రయాణానికి మేలి మలుపు అవుతుంది''అన్నారు నితిన్‌. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, సమర్పణ: లావణ్య.

  English summary
  Nithin is giving chances to new comers. Nitin who starred under debutant director Vijay Kumar Konda and scored a hit with ‘Gunde Jaari Gallantayyindhe’ is getting ready to star under new comer Srinivas Reddy. The film will be produced by his own Banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more