»   » హీరోయిన్ నిత్యా మీనన్ డైరెక్షన్

హీరోయిన్ నిత్యా మీనన్ డైరెక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నిత్యా మీనన్...హైటు తక్కువయినా అందం, అభినయంలో మాత్రం ఆమె రేంజి కాస్త ఎత్తులోనే ఉంటుంది. అమ్మడు కేవలం నటనకే పరిమితం కాకుండా త్వరలో దర్శకురాలిగా మారుతానంటోంది. అయితే అది ఇప్పుడే కాదని, ఫ్యూచర్లో అందుకు సంబంధించిన ఫ్లాన్స్ ఉంటాయని చెబుతోంది.

‘నేను ఎప్పటికైనా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. ఈ జిప్టియన్ సింగర్ జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో ఇది సాధ్యం అవుతుందేమో. త్వరలోనే స్ట్రిప్టు వర్కు కూడా మొదలు పెడతాను' అంటోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Nitya Menen Into Direction

నిత్యా మీనన్ ప్రస్తుతం తెలుగులో...
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇందులో నిత్యామీనన్ కొత్తగా పెళ్లైన అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. ఈమెకు భర్తగా చైతన్య కృష్ణ కనిపించనున్నారు. చైతన్య కృష్ణ గతంలో వెన్నెల వన్ అండ్ హాఫ్, నిన్ను కలిసాక, అది నువ్వే, కాళీ చరణ్ వంటి చిత్రాలు చేసారు. అయితే బ్రేక్ రాలేదు. ఇప్పుడు పెద్ద హీరో, పెద్ద డైరక్టర్ కావటంతో నిత్యామీనన్ కు భర్తగా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. దీంతో పాటు తమిళంలో మూడు సినిమాలు, మళయాలంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది నిత్యామీనన్.

English summary
Nithya who is enjoying the success of the film Malli Malli Idhi Rani Roju said that “I am hoping to direct a film someday. I am a voracious reader and was totally spellbound over a biopic of an Egyptian singer. I urge to make a film on the singer’s life and even started to write the script.”
Please Wait while comments are loading...