»   » స్టార్ హీరోలతో చెయ్యాలని లేదని తేల్చి చెప్పింది

స్టార్ హీరోలతో చెయ్యాలని లేదని తేల్చి చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : స్టార్ హీరోలతో చేస్తేనే ఎదుగుతాననే అభిప్రాయం నాకు లేదు...నా పాత్ర బాగుండి..సినిమా కథ నచ్చితే మిగతావేమీ పట్టించుకోను అంటోంది నిత్యామీనన్. ప్రస్తుతం చేరన్‌ దర్శకత్వంలో 'ఏమిటో ఈ మాయ' లో నటించింది. తమిళంలో ఇప్పటివరకు ఒక్క హిట్‌ లేకపోయినా స్టార్ హీరోల సరసన కనిపించాలన్న కోరిక లేదంటోంది.

నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'ఏమిటో ఈ మాయ' చిత్రీకరణ పూర్తయింది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. శ్రీప్రియ దర్శకత్వంలోని '2 ఫిమేల్‌ కోట్టయం' అనే మలయాళ రీమేక్‌లో నటిస్తున్నా. అల్లరి అమ్మాయి పాత్రలే పోషిస్తున్నారేంటని అడుగుతున్నారు. ప్రతి హీరోయిన్ అలాంటివే ఇష్టపడుతోంది. ఆ పేరు నుంచి బయటపడాలని భిన్నమైనవి ఎంచుకోవాలనుకుంటున్నా..అంది.

అలాగే హీరోయిన్ కి కీలకంగా ఉండే కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. 'అలా మొదలైంది'లో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల 'అప్పా' అనే చిత్రంలో మేకప్‌ లేకుండా నటించా. అగ్రస్థానానికి ఎదగాలంటే పెద్ద హీరోల సరసన నటిస్తేనే సాధ్యమవుతుందనుకోవడం నిజం కాదు. మనం ప్రదర్శించే నటనే పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని అభిప్రాయపడింది.

తెలుగులో అందుకున్న విజయాల్లాంటివి తమిళంలో రాలేదనే బెంగతో ఉంది నటి నిత్యమీనన్‌. 'సెగ', '180' చిత్రాలు నిరాశ పరచటంతో ఆవేదన చెందుతోంది. అయినా 'ఏమిటో ఈ మాయ' చిత్రంతో అక్కడా నిలదొక్కుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.

చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్‌, నిత్యమీనన్‌ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌.

English summary

 Sharwanand, Nithya Menon are set to team up for a new film titled ‘Yemito Ee Maya’.The film will be made simultaneously in bilingual versions in Tamil and Telugu and Kollywood director Charan will wield the megaphone for the movie... Touted to be a romantic entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu