»   » 'సహజీవనం' పై నిత్యామీనన్ బోల్డ్ కామెంట్స్ (పూర్తి ఇంటర్వూ)

'సహజీవనం' పై నిత్యామీనన్ బోల్డ్ కామెంట్స్ (పూర్తి ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''ప్రేమ, సహజీవనం, పెళ్లి... ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వారివి. ఇది సరైనదా.. కాదా అని ఎవ్వరం చెప్పలేం. అయితే ఇదివరకటితో పోలిస్తే సమాజం మారుతోంది. అలాగే లవ్ అండ్ రిలేషన్ షిప్స్ అనేవి నా పరంగా చాలా సీక్రెట్

కొన్నేళ్ల క్రితం ఒకరినొకరు చూడకుండానే పెళ్లి చేసుకొనేవాళ్లు. వాళ్లు జీవితాంతం కలిసే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. మనుషుల ఇష్టాయిష్టాలు మారుతున్నాయి. ఇటీవల ఇలాంటి సున్నితమైన అంశాల నేపథ్యంలోనే సినిమాలొస్తున్నాయి''. అంటోంది నిత్యామీనన్. సహజీవనం నేపథ్యంలో సాగే చిత్రం 'ఓకే బంగారం' లో ఆమె హీరోయిన్ గా చేసింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంటోంది నిత్యామీన్. నిత్యా మీనన్ నటించిన ఓకే బంగారం సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా S/O సత్యమూర్తి, తమిళ్ లో రిలీజ్ అయిన కాంచన 2 కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.
ఎలాంటి భావోద్వేగాన్నైనా అలవోకగా పలికించగల నటి నిత్య. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఓకే బంగారం'తో ఆమె సందడి చేస్తోంది. అందులో తన అందమైన నవ్వుతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లోనూ ఓ కీలక పాత్ర పోషించింది. నిత్య మేనన్‌ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

స్లైడ్ షోలో... నిత్యామీనన్ ఏం చెప్పింది..

విభిన్నమైన పాత్రలు

విభిన్నమైన పాత్రలు

''గతేడాది చేసిన సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒక సినిమాకీ మరో సినిమాకీ మధ్య ఏమాత్రం పోలిక లేకుండా విభిన్నమైన పాత్రల్ని పోషించాను. వాటిని తెరపై చూసుకొంటుంటే ఒక నటిగా ఎంతో సంతృప్తి కలుగుతోంది.

ఆ మేరకు నటించా

ఆ మేరకు నటించా

ప్రేమ అనేది ఓ మధురమైన భావన. ఆ నేపథ్యంలో సినిమా చేయడమంటే ఇష్టం. 'ఓకే బంగారం' నేను చేసిన చిత్రాల్లో చాలా ప్రత్యేకమైంది. మణిరత్నం క్లాసీగా సినిమాను తెరకెక్కించారు. మణిరత్నంగారు ఈ కథ గురించి చెప్పగానే... ఆయన సినిమాను ఎలా తెరకెక్కిస్తారో వూహించా. ఆ మేరకు నేను నటించా.

దుల్కర్‌ తో...

దుల్కర్‌ తో...

దుల్కర్‌ సల్మాన్‌తో అంతకుముందు నేను రెండు సినిమాలు చేశాను. దీంతో ఇద్దరం కథలో మరింతగా ఇమిడిపోయాం. ఒకేసారి నేను దల్కేర్ సల్మాన్ కలిసి చేసాం. మలయాళంలో 100 డేస్ ఆఫ్ లవ్ అండ్ ఓకే బంగారం ఒకేసారి చేస్తాను. అందులో మా ఇద్దరి మధ్యా మంచి రాపో ఉంది. ఓకే బంగారం ఇంటెన్స్ ఫిల్మ్, అలాంటప్పుడు నేను దల్కేర్ కంఫర్టబుల్ గా ఉండాలి. మేము అలా ఉండగాలిగాం కాబట్టే ఆన్ స్క్రీన్ అంత బాగా వచ్చింది. యాక్టింగ్ బాగా చేస్తే కెమిస్ట్రీ ఆటోమాటిక్ గా వస్తుందని నమ్ముతాను.

కెమిస్ట్రీనే..

కెమిస్ట్రీనే..

సినిమాలో హీరో,హీరోయిన్ పాత్రల మధ్య కీలకం కెమిస్ట్రీనే. అది ఎక్కడ్నుంచో వూడిపడేది కాదు. నా దృష్టిలో నటనే కెమిస్ట్రీ. కథ, పాత్రల్ని ఎంత బాగా అర్థం చేసుకొని నటిస్తే అంత బాగా సన్నివేశం పండుతుంది''అని చెబుతోంది నిత్య మేనన్‌.

అదే చూస్తాను

అదే చూస్తాను

''సినిమాలో నేను చేసే పాత్ర చిన్నదా? పెద్దదా? లేక ప్రత్యేక గీతమా? ఇవేవీ నాకు ముఖ్యం కాదు. ఆ కథ, పాత్రలు నాలో ఎంతగా ఆసక్తిని రేకెత్తిస్తాయన్నదే కీలకం.

'అత్తారింటికి దారేది' ఎంజాయ్ చేసా

'అత్తారింటికి దారేది' ఎంజాయ్ చేసా

త్రివిక్రమ్‌ సినిమాల్ని నేను బాగా ఇష్టపడతాను. ఆయన చేసిన చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని చూసి బాగా ఆస్వాదించాను. వాణిజ్య నేపథ్యంతో కూడిన చిత్రాలే అయినా... వాటిలో బలమైన అంశాన్ని చెబుతుంటారాయన.

అందుకే 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో చిన్న పాత్ర చేశా

అందుకే 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో చిన్న పాత్ర చేశా

త్రివిక్రమ్ శైలి నచ్చడంతోనే 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో చిన్న పాత్ర చేశా. అలాంటి చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది. సినిమాలో కథంతా నా చుట్టూనే తిరగాలి, నేను చేసే సినిమా కథానాయిక ప్రాధాన్యంతో ఉండాలి అని నేనెప్పుడూ కోరుకోను. నిజాయతీతో కూడిన చిన్న పాత్ర అయినా ఫర్వాలేదనుకొంటా

ఇక్కడే నేను సక్సెస్..

ఇక్కడే నేను సక్సెస్..

''తెలుగులోనే నాకు ఎక్కువ విజయాలు లభించాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ప్రత్యేకం. నన్ను, నా పాత్రల్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇంత ఆదరణ వేరే ఎక్కడా లేదు. అందుకే ప్రతి పాత్రనీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొనే ఎంచుకొంటున్నా. కమర్షియల్‌ చిత్రాల్లో భాగం కావడం వెనక కారణం కూడా అదే. తెలుగు ప్రేక్షకుల కోసం నన్ను నేను చాలా మార్చుకొన్నా.

సమంత నేనూ...

సమంత నేనూ...

నా కెరీర్ మొదటి నుంచే సమంత నన్ను పొగుడుతూ ఉంటుంది. నా యాక్టింగ్, నా వర్క్ అంటే తనకి ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా ఓకే బంగారం చూసి అన్ బిలీవబుల్ అని మెసేజ్ చేసింది. సత్యమూర్తి టైంలో ఇద్దరం కలిసి పనిచేశాం.. ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాం. యాక్టర్స్ గా ప్రొఫెషనల్ గా ఇద్దరికీ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ బయట ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం.

బాలీవుడ్ కు ...

బాలీవుడ్ కు ...

బాలీవుడ్‌కి వెళ్లాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళ మంచి కథ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచిస్తా. నేను ట్రై కూడా చేయలేదు. ఒకవేళ నాదారిలో ఏదన్నా మంచి స్క్రిప్ట్ వస్తే నాకు నచ్చితే చేస్తాను.

బెంగుళూరు డేస్ రీమేక్ లో ఎందుకంటే..

బెంగుళూరు డేస్ రీమేక్ లో ఎందుకంటే..

నిజం చెప్పాలంటే అంజలి మీనన్ ఆ కథ రాసింది నాకోసమే.. కానీ అప్పుడు చేసే టైం లేక మెయిన్ లీడ్ అయిన నజరియా పాత్ర కాకుండా వేరే రోల్ చేసాను. ఇప్పుడు అదే అవకాశం తమిళ్ లో వచ్చింది. అది నా కథ కదా అందుకే చేస్తున్నాను.

బోల్డ్ గా...

బోల్డ్ గా...

నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అన్నీ చెయ్యగలగాలి, అలా చేయ్యలేదు అంటే నాకో ముద్ర పడిపోతుంది. నా పరంగా నేను అన్నీ భావాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా లవ్ ని రకరకాలుగా మనం చెప్పచ్చు. ఎలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చినా నేను ముందు డైరెక్టర్ దీన్నెలా చూపిస్తాడు అని ఆలోచిస్తాను. నా వేవ్ లెంగ్త్ కి డైరెక్టర్ కనెక్ట్ అయితే సినిమా చేసేస్తాను.

English summary
Nitya Menon is currently riding high with the success of her recent releases Son of Satyamurthy, Kanchana 2, ok bangaram, bangalore days. Let’s see what she has to say.
Please Wait while comments are loading...