twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణగారు అంటుంటే పొంగిపోయా: నిత్యామీనన్

    By Srikanya
    |

    హైదరాబాద్ :'ఒక్కడినే' సినిమా పాటల వేడుకలో 'నిత్య మంచి నటి' అని బాలకృష్ణగారు అంటుంటే పొంగిపోయాను. 'ద్రౌపది పాత్రకు ఎంపిక చేసుకునేవాణ్ణి' అన్న ఆయన ప్రశంసను నా కెరీర్లో మరిచిపోలేను అంటూ మురిసిపోతూ చెప్తోంది నిత్యామీనన్. అలాగే ....ఏ పాత్రకైతే నేను న్యాయం చేయగలనని అనుకుంటానో దానికి అనుగుణంగానే కథలను ఎంచుకుంటాను. నటనకు ఆస్కారంలేని పాత్రలు చేయడం వృథా అనేది నా సిద్ధాంతం. కేవలం గ్లామర్‌ని దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్న పాత్రలకు నేను న్యాయం చేయలేను కూడా అంది.

    నిత్యామీనన్ మాట్లాడుతూ.... నేను ఒక కథ విన్నానంటే... అందులో నా పాత్రకు కొంత ప్రాధాన్యముండాలి. ఏదో పాటలకోసమో, అందాల ప్రదర్శనకోసమో అయితే అలాంటి పాత్రలను చేయను. సినిమా చేయనని కచ్చితంగా చెప్పేస్తాను. ఒక సినిమా ద్వారా వచ్చిన గుర్తింపును అడ్డం పెట్టుకుని అవకాశాలు పొందడం నాకు ఇష్టం ఉండదు. నేను అలా చేసి ఉంటే ఇప్పటికే నా చేతిలో చాలా సినిమాలుండేవి అంది.

    ఇక నా జీవితంలో మరచిపోలేని సంవత్సరమంటే 2011. 'అలా మొదలైంది' సినిమా విడుదలైంది అప్పుడే. నిజానికి అదొక్కటే కారణం కాదు. సినిమా అంటే ప్రధానంగా కెమెరా పనితనమే. ప్రేక్షకులను కట్టిపడేసేది తెరమీద కనిపించే నటీనటులూ వాళ్ల నటనా అయితే... వాటిని అందంగా చూపించేది కెమెరా కన్నే. అందుకే, నాకు సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకోవాలనిపించింది. పుణెలో చేరిపోదామని అన్నీ సిద్ధం చేసుకున్నాను కూడా. కానీ, నందినీరెడ్డి నా జీవితాన్ని మళ్లీ మలుపుతిప్పింది. నేను తమిళ సినిమాలు చేస్తున్న సమయంలో తను నాకు పరిచయమయ్యింది. సాధారణంగా నాకు స్నేహితులు తక్కువ. కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను.

    కానీ, నందినీ నేనూ కొద్ది సమయంలోనే మంచి స్నేహితులమైపోయాం. నేను సినిమాటోగ్రఫీ కోర్సులో చేరదామనుకుంటున్న సమయంలో తను 'అలా మొదలైంది' కథతో నా దగ్గరకు వచ్చింది. కథ నాకు నచ్చినా నేను చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నందినీ... నువ్వు సినిమాటోగ్రఫీ కోర్సులో చేరితే ఒక మంచి నటిని పరిశ్రమ కోల్పోతుంది. పైగా ఆ కోర్సు వల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నువ్వు పరిశ్రమకు దూరమైతే మళ్లీ అవకాశాలు రావడం కష్టం' అని నా బ్రెయిన్‌ వాష్‌ చేసేసింది. తను చెప్పిందంతా నిజమే అనిపించింది. మరో ఆలోచన లేకుండా తనకి ఓకే అనేశాను.

    'అలా మొదలైంది' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. నంది అవార్డుతో పాటు అప్పటివరకూ కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనే నటించిన నాకు తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిందా సినిమా. ఆ తరవాత అదే ఏడాది ఆరు సినిమాల్లో నటించాను. 2012లో ఏడు, 2013లో నాలుగు సినిమాలు చేశాను. ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగులో 180, ఇష్క్‌, ఒక్కడినే, జబర్దస్త్‌, గుండెజారి గల్లంతయ్యిందే మొదలైన సినిమాలు చేశాను అంటూ తన కెరీర్ గురించి వివరించింది.

    English summary
    Nandamuri Balakrishna was in full flow at the audio launch of Nara Rohit and Nithya Menon’s upcoming film Okkadine. He is all praise for the female lead of the film, Nithya Menon. According to the actor, it’s the luck of Telugu people to get a heroine like Nithya in times where zero size trend is continuing. “Nithya Menon is a very good actress and she belongs to the league of Savithri, Nargis, Madhu Bala and Soundarya. All the Telugus should feel proud of Her. Nithya, a Nandi award winner, has earned a name for herself in the Industry by choosing good role. Her presence has reduced the drought of good heroines in Industry to some extent,” opines the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X