»   » తమన్నా దుస్తులు విప్పడంపై.... తాప్సీ, నిత్య మీనన్ విమర్శలు!

తమన్నా దుస్తులు విప్పడంపై.... తాప్సీ, నిత్య మీనన్ విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాలో ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఎంత హాట్‌గా ఉన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా మంది కుర్రోళ్లు ఆ రొమాంటిక్ సీన్, పచ్చబొట్టేసిన సాంగ్ చూడటానికే మళ్లీ మళ్లీ థియేటర్లకు వెలుతున్నారు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధం సీన్ తర్వాత సినిమాలో అత్యంత హైలెట్ అయిన సీన్ ఈ రొమాంటిక్ సన్నివేశమే.

మరో వైపు ఈ సీన్ పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది రొమాంటిక్ సన్నివేశంలా లేదని, అవంతిక(తమన్నా) రేప్ చేయబడినట్లు ఉందంటూ పలువురు స్త్రీ వాదులు ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు సైతం రాసారు. వీరు మాత్రమే కాదు పలువురు హీరోయిన్లు కూడా ఈ సీన్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు సమాచారం.


నేరుగా అనక పోయినా, పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా మాత్రమే దర్శకులు చూస్తుంటారని, అసలు ఇలా చూపించడం ద్వారా హీరోయిన్లను తక్కువ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని తాప్సీ, నిత్యా మీనన్ లాంటి వారు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు రాజమౌళిని ఉద్దేశించి అన్నవే అని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే బాహుబలి పార్ట్ 1 అఖండ విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మళ్లీ ఈ రికార్డు బద్దలు కొట్టడం బాహుబలి పార్ట్ 2తోనే సాధ్యం.


Nitya Menon, Tapsi comments on Baahubali

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ముంబై మీడియా ఓ వార్తను ప్రచారం చేస్తోంది. హిందీ వెర్షన్ ని ప్రమోట్ చేసిన కరుణ్ జోహార్ ఈ సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి పై చాలా ప్రెజర్ తెస్తున్నారని.


ఇంతకీ ఏంటా ప్రెజర్ అంటే...నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి...సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోమని చెప్తునానారట. అంతేకాదు...రాజమౌళి ఏ ఆర్టిస్టులను అయితే అడుగుతారో వారిని ఖచ్చితంగా తీసుకువస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎంతవరకూ నార్త్ ఫేస్ లు మనకు ఇక్కడ సౌత్ లో వర్కవుట్ అవుతారనేది కూడా డిస్కస్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

English summary
Nithya Menon, Tapsi shocking comments on Baahubali.
Please Wait while comments are loading...