»   »  రెండు సార్లు రేప్ చేసినా, నాకు ఆ ఫీలింగ్ కలగలేదంటూ నిత్యామీనన్

రెండు సార్లు రేప్ చేసినా, నాకు ఆ ఫీలింగ్ కలగలేదంటూ నిత్యామీనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలినుంచీ గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది నిత్యమీనన్. రీసెంట్ గా ఆమె 'ఘటన' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఈమె అత్యాచారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై రెండు సార్లు అత్యాచారం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా.. సరే తనపై రేప్ జరిగిందన్న విషయమే తనకు తెలియలేదని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే, తనపై రేప్ జరిగింది నిజ జీవితంలో కాదని, సినిమాలో అని చెప్పుకొచ్చింది.

Nityamenon about her latest Ghatana movie

నిత్యామీనన్ మాట్లాడుతూ... తన తాజా చిత్రం ఘటనలో తాను రెండు సార్లు అత్యాచారానికి గురవుతానని, సినిమాలో విలన్‌గా నటించిన సీనియర్ నటుడు నరేశ్ చేతిలో రెండు సార్లు అత్యాచారానికి గురయ్యే సన్నివేశాలు ఉంటాయని చెప్పింది. ఆ రెండు సీన్స్ ను సున్నితంగా చిత్రీకరించడంతో.. అది రేప్ అన్న ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. రేప్ సీన్‌లో నటించానన్న ఫీలింగ్ రాలేదని పేర్కొంది.

మరో ప్రక్క ఇదే సినిమా విషయమై నటుడు నరేశ్‌ని తన తల్లి విజయ నిర్మల చెంపదెబ్బ కొట్టారట. నిత్యామేనన్‌, క్రిష్‌ జె. సత్తార్‌, నరేశ్‌, కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 'ఘటన' చిత్రం ఈ నెల 18న విడుదలైంది. శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివకుమార్‌ సమర్పించారు. ఈ చిత్రాన్ని చూసిన విజయ నిర్మల అందులో విలన్ పాత్ర పోషించిన నరేశ్‌ను చెంపదెబ్బతో ప్రశంసించారట. ఈ విషయాన్ని నరేశ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. .

''ఘటన' సినిమా చూసి అమ్మ చెంప మీద కొట్టారు. ప్రతినాయకుడి పాత్రను చక్కగా పోషించినందుకు ఇది నా బహుమతని చెప్పారు. తర్వాత దీవిస్తూ.. ఇది నా కుమారుడి కోసం.. అన్నారు' అని నరేశ్‌ ట్వీట్‌ చేశారు.

Nityamenon about her latest Ghatana movie

నరేశ్‌ ప్రస్తుతం పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన 'శ్రీ శ్రీ' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా నటించారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమేల్‌ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌.కృష్ణ ఎం. తెలుగులోకి 'ఘటన' పేరుతో రీమేక్‌ చేసారు.

English summary
Nithya menon shocking comments on rape scene in Ghatana movie. Actress Nithya Menon’s most delayed film ‘Ghatana’ which initially titled as ‘Malini 22 Vijayawada’, at last releasing worldwide on November 18th. It is a thriller film directed by Sripriya and produced by Rajkumar Sethupathy under his banner Rajkumar Theatres Pvt Ltd. It stars Nithya Menen in the title role while Krish J. Sathaar and Naresh play supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu