»   » నిత్యానంద, రంజిత రాసలీలలతో బీజేపీ సీనియర్ నాయకుడి సినిమా

నిత్యానంద, రంజిత రాసలీలలతో బీజేపీ సీనియర్ నాయకుడి సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యానంద పై రోజుకో సినిమా మొదలై ఆయనకు కొత్త తలనొప్పిని పెడుతూ వస్తోంది. తాజాగా కన్నడంలో మదన్ పటేల్ అనే దర్శక,నిర్మాత సత్యానంద అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తమ చిత్రంలో నిత్యానంద నిజ జీవితంలో సంఘటనల, రజితతో రాసలీలలు అన్నీ ఉంటాయని ప్రజలకు నిజం తెలియాలనే ఆలోచనలతోనే ఈ చిత్రం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు పలు భాషల్లోకి అనువదించనున్నట్లు తెలిపారు. అంతేగాక నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక యువకుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. నటి రంజిత తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని చెప్పడాన్ని మదన్ పటేల్ ఖండించారు. అదే నిజమైతే సత్యానంద చిత్రంలో నటించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు.

బీజేపీ సీనియర్ నాయకుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన మదన్‌పటేల్ ..ప్రత్యేకంగా రజిత విషయాన్ని ప్రస్దావించారు. కొద్ది రోజుల క్రితం రంజిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీడియా సమావేశం జరిగిన తర్వాత రోజే నిత్యానంద ఆశ్రమానికి రంజిత వెళ్లి పాదపూజ నిర్వహించడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. కావాలంటే తాను ఇప్పుడే రంజితతో మాట్లాడతానంటూ ఆమెకు ఫోన్ చేశారు.

అయితే స్విచ్చాఫ్ చేసి ఉన్నట్లు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. నిత్యానంద వల్ల వేధింపులకు గురైనవారు, మోసపోయిన వారు తనకు వివరాలు వెల్లడించాలని.. వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతానని చెప్పారు. సత్యానంద సినిమా పోస్టర్లలో నిత్యానంద ఫొటోను తాను ఉపయోగించుకోలేదన్నారు. అలాగే తెలుగులో రాజేంద్రప్రసాద్ కూడా నిత్యానంద గెటప్ వేస్తున్నారు. వీటితో పాటు ఇదే పాయింట్ తో తమిళంలోనూ ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu