»   » జై లవ కుశ: ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ ఈవిడే..

జై లవ కుశ: ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ ఈవిడే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ ఖరారు చేసారు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ ఉంటుందని టాక్.

హీరోయిన్లు ఖరారు

హీరోయిన్లు ఖరారు

ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నాను ఖరారు చేయగా... తాజాగా నివేదా థామస్ ను మరో హీరోయిన్ పాత్రకు ఫైనల్ చేస్తూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఓ పాత్రకు హీరోయిన్ ఉండదని తెలుస్తోంది.

సమంత?

సమంత?

ఈ సినిమాలో హీరోయిన్ సమంత గెస్ట్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్. సమంత ఇప్పటికే ఎన్టీఆర్ కలిసి నాలుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

మోషన్ పోస్టర్ సూపర్

ఇటీవల విడుదలైన ‘జై లవ కుశ' మోషన్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.

English summary
The makers of upcoming much awaited drama ‘Jai Lava Kusa’ has made the announcement regarding the second female lead and she is none other than actress Niveda Thomas. KalyanRam who is producing the movie under the banner of NTR Arts, took the twitter and wrote, “We are happy to announce that the very talented Nivetha Thomas is officially on board #NTR27. Welcome to Team #JaiLavaKusa."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu