Don't Miss!
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Finance
Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
షాకినిగా రెజీనా.. డాకినీగా నివేదా థామస్.. సెన్సేషనల్ రీమేక్‌తో అందాల భామలు
దక్షిణాదిలో తమ ప్రతిభతో దూసుకెళ్తున్న అందాల భామలు రెజీనా కసండ్రా, నివేదా థామస్ మరోసారి విభిన్నమైన పాత్రలతో ముందుకు వస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో ఆకట్టుకొంటున్న ఈ ఇద్దరు సెన్సేషనల్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. షాకిని డాకినీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా గురించి మరిని వివరాలు..

దక్షిణ కోరియా సినిమాలపై టాలీవుడ్ దృష్టి
ప్రస్తుతం టాలీవుడ్ దృష్టి అంతా దక్షిణా కోరియా సినిమాలపై పడినట్టు కనిపిస్తున్నది. సౌత్ కోరియాలో విజయం సాధించిన మిస్ గోని ఆధారంగా సమంత అక్కినేని నటించిన ఓ బేబి మూవీ సక్సెస్ కావడంతో టాలీవుడ్ నిర్మాతలు ఆ చిత్ర పరిశ్రమపై కన్నేశారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన డ్యాన్సింగ్ క్వీన్, లక్కీ కీ, మిడ్ నైట్ రన్నర్స్ అనే మూడు చిత్రాల హక్కులను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

షాకిని డాకినిగా రెజీనా, నివేదా థామస్
మిడ్‌నైట్ రన్నర్స్ చిత్రాన్ని షాకిని, డాకినీ టైటిల్‌తో తెలుగులో నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

షాకిని, డాకినికి కరోనా ఎఫెక్ట్
ఇక షాకిని డాకినీ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగింది. అయితే ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. అయితే కరోనావైరస్ పరిస్థితులు అడ్డంకిగా మారడంతో ఈ సినిమా షూటింగును వాయిదా వేశారు. ఈ సినిమాలో రెజీనా, నివేదా పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయని తెలుస్తున్నది.

ట్రైనీ పోలీస్ ఆఫీసర్లుగా
షాకిని డాకిని సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో రెజీనా, నివేదా ఇద్దరు ట్రైనీ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. ఓ రాత్రి జరిగిన అమ్మాయి అక్రమ రవాణా, కిడ్నాప్ కేసును తమ చేతిలోకి తీసుకొని ఎలా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేశారనేది ఈ సినిమా కథ అని తెలుస్తున్నది.
Recommended Video

యాక్షన్ సీన్ల కోసం రెజీనా, నివేదా
యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న షాకిని, డాకిని చిత్రం కోసం రెజీనా, నివేదా ఫైట్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందినట్టు సమాచారం. త్వరలోనే వీరిద్దరిపై స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూసి ఎక్సైట్ అయ్యాను. మా పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అని రెజీనా తెలిపారు.