»   »  బాబోయ్..ఎన్టీఆర్ హీరోయిన్ కు ఇంత ధైర్యం ఏంటి.. ఫోటోలు చూస్తే అంతే!

బాబోయ్..ఎన్టీఆర్ హీరోయిన్ కు ఇంత ధైర్యం ఏంటి.. ఫోటోలు చూస్తే అంతే!

Subscribe to Filmibeat Telugu

జెంటిల్ మన్ చిత్రంతో చిత్రపరిశ్రమలోకి నివేద థామస్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే నివేద థామస్ తన అభినయంతో ఫిదా చేసింది. ఈ చిత్రంలో నివేద నటనకు అవార్డు కూడా దక్కడం విశేషం. ఆ తరువాత నిన్ను కోరి, జై లవ కుశ వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలు దక్కిందుకుంది. నివేద కోసం ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాక్ కు గురి కావలసిందే.

నివేదా ఏంటా ధైర్యం

సాధారణంగా పాములకు దాదాపుగా అందరూ భయపడుతారు. మహిళా మణుల్లో అయితే ఆ భయం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొండచిలువని మెడలో చుట్టుకుని నివేద థామస్ వీరలెవల్లో ఇచ్చిన ఫోజు ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేస్తూనే థ్రిల్ చేస్తోంది. చిన్న పనే కానీ అనుకున్నంత చిన్నది కాదని కామెంట్ కూడా పెట్టింది.

జెంటిల్ మన్ లో నటన అదుర్స్

జెంటిల్ మన్ లో నటన అదుర్స్

జెంటిల్ మన్ చిత్రంలో నివేద నటనకు అంత ఫిదా అయ్యారు. రెగ్యులర్ హీరోయిన్ల లా కాకుండా నివేద తన ప్రత్యేకతని చాటుకుంది. ఈ చిత్రంలో నివేద నటనకు ఉత్తమ నటిగా సైమా అవార్డు దక్కింది.

 నిన్నుకోరితో మరో హిట్టు

నిన్నుకోరితో మరో హిట్టు

నానితో మరో మారు కలసి నటించిన నిన్ను కోరి చిత్రం కూడా విజయం సాధించింది. దీనితో నివేద టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

 ఎన్టీఆర్ తో ఛాన్స్

ఎన్టీఆర్ తో ఛాన్స్

ఎన్టీఆర్ చివరగా నటించిన జైలవకుశ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నివేద ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. జైలవకుశ హిట్ తో హ్యాట్రిక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.

 హద్దుల్లో గ్లామర్ షో

హద్దుల్లో గ్లామర్ షో

నివేద థామస్ నటనకు ప్రధాన్యత ఉన్న పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అందాల ఆరబోతకు నివేద వ్యతరేకం. ఇప్పటివరకు నివేద నటించిన అన్ని చిత్రాల్లో గ్లామర్ షోకు హద్దులు పాటించింది. ఈ మధ్యకాలంలో నటనకు ప్రాధాన్యతనిస్తున్న కొద్ది మంది హీరోయిన్లలో నివేద ఒకరు.

యువ హీరోతో రొమాన్స్

యువ హీరోతో రొమాన్స్

నివేదా థామస్ తదుపరి యువ హీరో నాగ శౌర్య సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. సాయి శ్రీరామ్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. కురివి అనే తమిళ సినిమాలో కూడా నటిస్తోంది.

English summary
Nivetha Thomas shocking pose with python. Pics goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu