»   » ‘బ్రహ్మోత్సవం’ వసూళ్ల లెక్కలు ఫేక్ అని తేల్చేసారు!

‘బ్రహ్మోత్సవం’ వసూళ్ల లెక్కలు ఫేక్ అని తేల్చేసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నైజాం ఏరియాలో అభిషేక్ పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజైన రోజు నుండి ఈ చిత్రానికి సంబంధించిన వసూళ్ల గురించి రకరకాల లెక్కలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఆ లెక్కలన్నీ ఫేక్ అని అభిషేక్ పిక్చర్స్ వారు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 'బ్రహ్మోత్సవం నైజాం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ నెల 27న ఉదయం అఫీషియల్ గా ప్రకటిస్తాం. ఫేక్ వసూళ్ల గురించి పట్టించుకోవద్దు, థాంక్యూ' అని ట్వీట్ చేసారు.

రీ అంచనాలతో వచ్చిన మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ ధరలకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు అభిమానుల...చెత్త ఫైట్!

ఈ చిత్రాన్ని రిలీజ్ ముందే నిర్మాత పివిపి లాభాలకు అమ్మేసారు. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో 60 శాతమ మేర నష్టపోయే అవకాశం ఉందని, మరికొన్ని ఏరియాల్లో 40 శాతం మేర నష్టాలు తప్పని అంచనా వేస్తున్నారు.

అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని పివిపి మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నష్టాల్లో సగం తాను భరిస్తానని, డబ్బులు తిరిగి ఇష్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ఇవన్నీ మామూలే అయినా.... నిర్మాత పివిపి మంచి మనసుతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక బ్రహ్మోత్సవం సినిమా చూసిన ప్రేక్షకులు కూడా....తాము బాధితులమే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా గోడు వెల్లబోసుకుంటున్నారు. తమలా మరొకరు ఇలా బాధితులు కావొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారమే సినిమాను మరింత దెబ్బతీస్తోంది.

English summary
"Brahmotsavam Nizam 1st week collection will be officially announce on 27th Morning ... Ignore fake share Thank you" ABHISHEK PICTURES tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu