»   » పవన్ కళ్యాణ్‌ మేనేజర్, నిర్మాత మోసం: నైజాం డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన!

పవన్ కళ్యాణ్‌ మేనేజర్, నిర్మాత మోసం: నైజాం డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నష్టాల ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. గతేడాది విడుదలైన ఈ సినిమాపై కేవలం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సాధారణ స్థాయికంటే ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. అయితే సినిమా ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.

నష్టపోయిన వారందరికీ సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అదే నిర్మాతతో 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నారు. అయితే ఇపుడు ఆ సినిమా రైట్స్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వకుండా బయటి వారికి ఇవ్వడంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు.

ఇటీవల కృష్ణా జిల్లా డిస్టిబ్యూటర్ సంపత్ కుమార్ ఈ విషయమై మీడియా ముందుకు రాగా...తాజాగా నైజాంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయిన దిలీప్ టాండన్, తరుణ్, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

మాకు అన్యాయం చేసారు

మాకు అన్యాయం చేసారు

సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా నష్టపోయిన ఇతర పంపిణీదారులకు నష్ట పరిహారంగా ‘కాటమరాయుడు' రైట్స్ తక్కువ రేటుకే ఇచ్చారు, మాకు మాత్రం అసలు రైట్సే ఇవ్వలేదు అని నైజా డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు.

పవన్ కళ్యాణ్ ను కలవనీయడం లేదు

పవన్ కళ్యాణ్ ను కలవనీయడం లేదు

పవన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామంటే అతన్ని కలిసే అవకాశం తమకు లభించడం లేదని, అసలు ఆ అవకాశం అతని మేనేజర్, నిర్మాత శరత్ మరార్ ఇవ్వడం లేదంటున్నారు నైజా డిస్ట్రిబ్యూటర్లు. పవన్ దృష్టికి విషయం వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

మోసం చేసారు

మోసం చేసారు

'కాటమరాయుడు' నైజాం రైట్స్ తమకు ఇవ్వడం ద్వారా నష్టాలు పూడుస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్... ఇపుడు ఇవ్వకుండా మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై సంపత్ కుమార్

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై సంపత్ కుమార్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా చేరిందని, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్నారని 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల 2 కోట్లు నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఆరోపించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా?

‘కాటమరాయుడు'కి సర్ప్రైజ్, జనసేనాని కోసం ఏం చేసారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు' చిత్రం షూటింగులో భాగంగా సెట్లో ఉండగా సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి విరవాలు, పోటోల కోసం క్లిక్ చేయండి.

‘కాటమరాయుడు' యాక్షన్ సీన్ లీక్, అప్రమత్తమైన టీం!

‘కాటమరాయుడు' యాక్షన్ సీన్ లీక్, అప్రమత్తమైన టీం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు' సినిమాకు సంబంధించిన ఓ సీన్ ఆన్ లైన్లో లీక్ అయింది.

అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్న రేణు దేశాయ్, అందరిలోనూ ఆసక్తి!

పవన్ కళ్యాణ్ ప్రియురాలిగా, భార్యగా ఉన్నంత కాలంగా ఎప్పుడూ మీడియా ముందుకు రాని రేణు దేశాయ్... ఆయతో విడిపోయిన తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఇపుడు ఆమె మరో ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మరోసారి స్పష్టం చేసారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Dilip Tandon and Tarun acquired 'Sardaar Gabbar Singh' Nizam rights and faced hugh losses. Sardaar Gabbar Singh directed by K. S. Ravindra. Produced by Pawan Kalyan and Sharrath Marar jointly under their banners Pawan Kalyan Creative Works and North Star Entertainment in association with Eros International.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu